- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM రేవంత్ రెడ్డికి కేటీఆర్ పాలాభిషేకం చేసినా తక్కువే: MLA
మాజీ మంత్రి కేటీఆర్‌కు ఆత్మే ఉంటే.. కార్మికులకు పని కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలని ప్రభుత్వ విప్ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణబ్యూరో: మాజీ మంత్రి కేటీఆర్‌కు ఆత్మే ఉంటే.. కార్మికులకు పని కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలని ప్రభుత్వ విప్ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్పదేళ్లు మంత్రిగా ఉన్న ఎం లాభం? సిరిసిల్లకు నూలు డిపోను తీసుకురాలేకపోయాడు.. కార్మికులను ఆదుకోలేకపోయాడని విమర్శించారు. రాష్ట్రంలోని నేతన్నకు అండగా ఉంటామన్న సీఎం రేవంత్ రెడ్డి చీరల తయారీ ఆర్డర్‌ను సిరిసిల్ల పవర్లూమ్స్‌కు అప్పగించి తన మాట నిలబెట్టుకున్నారన్నారు. మొదటి దశలో 4. 6 కోట్ల మీటర్ల చీరల తయారీకి ఆర్డర్ ఇచ్చిందని, దాంతో నేతన్నలకు ఎనిమిది నెలలపాటు పని దొరుకుతుందని పేర్కొన్నారు. ఆర్డర్లోని 95 శాతం పనులు సిరిసిల్లలో 20 వేల పవర్ లూమ్స్‌కే ప్రభుత్వం ఇచ్చిందని, కమీషన్లకు కక్కుర్తి పడి బతుకమ్మ చీరలు కిలోల చొప్పున సూరత్ నుంచి గత ప్రభుత్వం తీసుకువచ్చిందని విమర్శించారు.
బతుకమ్మ చీరలు సూరత్ నుంచి తెచ్చామని కేటీఆర్అసెంబ్లీలో ఒప్పుకున్న విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ సర్కారుస్వయం సహాయక మహిళలకు నాణ్యమైన చీరలు ఇవ్వబోతుందని స్పష్టం చేశారు. సిరిసిల్ల ప్రజలకు చర్మంతో చెప్పులు కుట్టించినా తప్పులేదని కేటీఆర్ గప్పాలు కొట్టిన కేటీఆర్ వల్ల సిరిసిల్లలో ఒక్క కార్మికుడి జీవితం కూడా మారలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేములవాడలో రూ.50 కోట్లతో నూలు డిపోను ఏర్పాటు చేసి, 90 శాతం సబ్సిడీతో కార్మికులకు నూలు సరఫరా చేస్తున్నామన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ పాలాభిషేకం చేసినా తక్కువేనని అన్నారు. గత ప్రభుత్వం బతుకమ్మ చీరల కు సంబంధించిన 222 కోట్ల బకాయిలను కాంగ్రెస్ప్రభుత్వం కార్మికులకు చెల్లించిందన్నారు. కనీసం సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్ విద్యుత్ బకాయిలు కూడా గత ప్రభుత్వం చెల్లించలేక పోయిందని విమర్శించారు. రేషన్ కార్డుల జారీ నిరంతరంగా కొనసాగుతుందని ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని విప్ఆది శ్రీనివాస్పేర్కొన్నారు.






