- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Congress MLA: ఓటమి భయంతో కేటీఆర్ దొంగ సర్వేలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
ఓటమి భయంతో కేటీఆర్ దొంగ సర్వేలను విడుదల చేస్తున్నారని, అవినీతి డబ్బుతో పేపర్, టీవీ, సోషల్ మీడియా పెట్టి తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రాబాద్‌ల్లో బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రాలేదు.. ఓటమి భయంతో కేటీఆర్ దొంగ సర్వేలను విడుదల చేస్తున్నారని, అవినీతి డబ్బుతో పేపర్, టీవీ, సోషల్ మీడియా పెట్టి తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ (MLA Shri Ganesh) ఆరోపించారు. (Jubilee Hills) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 60 శాతం ఓట్లు రాబోతున్నాయని దొంగ సర్వేలతో హడావిడి చేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. మంగళవారం హైదరాబాద్లోని సీఎల్పీలో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీ గణేశ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోతున్నామన్న సంకేతాలను కేటీఆర్ ఇచ్చారని, బై ఎలక్షన్ లో డిపాజిట్ తెప్పించడం కోసమే ఆయన ఆరాటపడుతున్నారన్నారు. కేసీఆర్, కేటీఆర్ లను కవితనే నమ్మడం లేదు..ఇక తెలంగాణ ప్రజలు ఎలా నమ్ముతారు అని శ్రీ గణేష్ ప్రశ్నించారు.
సికింద్రాబాద్ లోక్ సభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావుగౌడ్ కు 20 వేల ఓట్లు కూడా రాలేదని, జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ లో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయన్నారు. తన పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, బీఆర్ఎస్ 120 నెలల పాలనలో రాష్ట్రాన్ని దోచుకుందని శ్రీ గణేశ్ ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని, జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో విజయం సాధించబోతుందన్నారు. కంటోన్మెంట్ ప్రజలు కూడా సెంటిమెంట్ కు కాకుండా డెవలప్మెంట్ కే ఓటు వేసి గెలిపించారని, జూబ్లీహిల్స్ ప్రజలు సెంటిమెంట్ కు కాకుండా డెవలప్మెంట్ కు పట్టం కట్టబోతున్నారన్నారు.
కాంగ్రెస్ ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని హైదరాబాద్ ప్రజలు నమ్ముతున్నారని, హైదరాబాద్ లో వరదలు వస్తే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అమీర్‌పేట్ వెళ్లి పరిశీలించారని, ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా గణేష్ నిమజ్జనంలో సీఎం సామాన్యుడిలా పాల్గొన్నారన్నారు. కంటోన్మెంట్ లో కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించినందుకు అక్కడ అభివృద్ధి జరుగుతోందని, కంటోన్మెంట్ ప్రజల కోసం 1 ఎంజీడీ వాటర్ ను, పంప్ హౌస్ ను కూడా సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశారని, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను నిర్మిస్తున్నామని, తిరుమలగిరి చెరువును అభివృద్ధి చేస్తున్నామని శ్రీ గణేశ్ చెప్పారు.






