- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇప్ప పువ్వు ‘ద బ్రాండ్ ఆఫ్ తెలంగాణ’.. సారాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మళ్లీ కామెంట్స్
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇప్పపువ్వుతో చేసే సారా ఆర్గానిక్.. ఇది ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదు. అసెంబ్లీలో ప్రస్తావిస్తే ప్రతిపక్షాలు కూడా స్వాగతిస్తాయని ఆశిస్తున్నాను. చివరకు ప్రభుత్వం ఏది కరెక్టో అదే చేస్తుంది. కానీ ఇప్ప పువ్వు అనేది అడవిలో సహజంగా అభిస్తుంది. దీంతో మనం ప్రపంచ మార్కెట్‌లో పోటీ ఇవ్వవచ్చు. మెక్సికోలో టకీలా డ్రింక్, ఫ్రాన్స్‌లో కొనియా డ్రింక్ తయారు చేసి ఎగుమతి చేస్తున్నాయి. అందుకే ఇప్పసారాపై పూర్తి నివేదిక సిద్ధం చేసుకున్నా. లాభ, నష్టాలు రెండూ అసెంబ్లీలో మాట్లాడుతా. గతంలో ఇప్ప సారా తాగిన వారు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా 110 ఏళ్లు బతికారు. ప్రస్తుత మార్కెట్‌లో ఉన్న లిక్కర్ తాగి ఎవరూ 60 ఏళ్లకు మించి బతకడం లేదు. అందుకే ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నాను. దీంతో ఆదివాసీలు, ఎస్టీలకు జీవనోపాధితో దొరకడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి మంచి ఆదాయం కూడా లభిస్తుంది. ఇప్ప పువ్వు ‘ద బ్రాండ్ ఆఫ్ తెలంగాణ’’ అని అనిరుధ్ రెడ్డి చెప్పుకొచ్చారు.






