Congress MLA: కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే సవాల్

by Gantepaka Srikanth |
Congress MLA: కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)పై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(Naini Rajender Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కేటీఆర్ హన్మకొండ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో కేటీఆర్(KTR) చేసిన ఆరోపణలకు స్పందించిన నాయిని.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కబ్జా చేసిన పార్టీ కార్యాయలంలో కూర్చొని కేటీఆర్ దొంగ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సకల జనుల సర్వే రిపోర్ట్ ఏమైందని కేటీఆర్‌ను ఆయన ప్రశ్నించారు.

ప్రశ్నించే స్వేచ్ఛను హరించింది బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం అని, ఇందిరా పార్కు ధర్నా చౌక్ ఎత్తేసింది మీరు కాదా అని నిలదీశారు. బీఆర్ఎస్ పథకాలు అన్నీ దోపిడీ చేసేందుకే తీసుకొచ్చారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నేతలు పదేళ్లలో చేయలేని పనులను మేము చేస్తున్నామని అన్నారు. అసలు కబ్జా చేసిన పార్టీ కార్యాలయంలో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టడానికి సిగ్గుండాలని మండిపడ్డారు. వరంగల్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని, వరంగల్ అభివృద్ధిపై చర్చకు రావాలని వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కేటీఆర్కు సవాల్ విసిరారు.

Advertisement

Next Story