ఎమ్మెల్యే పదవికి రాజీమానా చేస్తా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సెన్సేషనల్ కామెంట్స్

by Prasad Jukanti |

అక్రమ మైనింగ్, స్టోన్ క్రషర్ ఆరోపణలపై ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పందించారు.

ఎమ్మెల్యే పదవికి రాజీమానా చేస్తా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రషర్ దందాలో తనకు వాటా ఉందని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. కార్యకర్త స్థాయి నుంచి ప్రభుత్వ విప్‍గా ఎదిగానని ఎమ్మెల్యే కాకముందు నుంచే తాను వ్యాపారం చేశానన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. నేను వందల కోట్ల ఆస్తిపరుడినని నాకే బొచ్చడు ఆస్తులు ఉన్నాయన్నారు. పది రూపాయల తన సంపాదనలో తొమ్మిది రూపాయలు పేదల కోసమే ఖర్చు చేస్తానని, నా భూములే ఇతరులకు దానం చేస్తానన్నారు. నాకు అక్రమ సంపాదన అవసరంలేదన్నారు. కాగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం రాజాపేట మండలంలోని చల్లూరు గుట్టలో బీర్ల ఐలయ్య అక్రమ మైనింగ్‌, స్టోన్‌ క్రషర్‌ కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయని దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన ఐలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.

Next Story