MLC Kavitha : కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ అమలు చేయాలి : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-12 10:48:12  IST  )

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మైనార్టీలకు ఇచ్చిన డిక్లరేషన్(Minority Declaration) అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha)డిమాండ్ చేశారు.

MLC Kavitha : కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ అమలు చేయాలి : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రకటించిన మైనార్టీ డిక్లరేషన్ ( Minority Declaration) అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha)డిమాండ్ చేశారు. తబ్లీగీ జమాత్‌ ఇస్తేమా సారంగపూర్ ను కవిత సందర్శించి మాట్లాడారు. డిక్లరేషన్ హామీలను ఒక్కటి కూడా ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. 3వేల బడ్జెట్ పెట్టి 700కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పాలనలో గంగా జమునా సంస్కృతిని కాపాడారన్నారు. మైనార్టీలకు బీఆర్ఎస్ పదేళ్లలో అమలు చేసిన షాబీ ముబారక్ సహా విద్యార్థినిలకు ప్రోత్సాహక పథకాలను కాంగ్రెస్ అమలు చేయడంలేదన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్ లో ఉండటంతో ఆయన మైనార్టీల సంక్షేమం కోసం పనిచేస్తారన్న నమ్మకం లేదన్నారు. షాదీ ముబారక్ కింద రూ.1.6 లక్షలతో పాటు తులం బంగారం ఇస్తామని ఎగ్గొట్టారని విమర్శించారు. నిజమాబాద్ జిల్లాలో మైనార్టీలు అధికంగా ఉన్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ వారి ప్రభుత్వం నుంచి ఈ జిల్లా మైనార్టీలకు అధిక నిధులు సాధించాలని డిమాండ్ చేశారు. కవిత తన నిజామాబాద్ పర్యటనలో భాగంగా స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని గాజులపేట చౌరస్తా వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.

అర్సపల్లి శైలజ గ్రౌండ్స్ లో నిజామాబాద్‌ ప్రీమియర్‌ లీగ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్ని మండలంలోని బడా పహాడ్‌ దర్గా(పెద్ద గుట్ట)ను సందర్శించారు. బాన్సువాడ కొయ్యగుట్ట అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు.

Next Story