Congress: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను సన్మానించిన మంత్రి పొంగులేటి

by Ramesh Goud |

తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speker Gaddam Prasad Kumar) కు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Revenue Minister Ponguleti Srinivasa Reddy) సన్మానం చేశారు.

Congress: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను సన్మానించిన మంత్రి పొంగులేటి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speker Gaddam Prasad Kumar) కు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Revenue Minister Ponguleti Srinivasa Reddy) సన్మానం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో నేడు ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన భూ భారతి బిల్లు(Bhu Bharathi Bill) ఆమోదం జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ ఛాంబర్ లో మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్(Veerlapalli Shankar), బత్తుల లక్ష్మారెడ్డి(Bathula Laxma Reddy) సహా పలువురు నేతలు తెలంగాణ స్పీకర్ ను కలిశారు. శాసనసభలో భూ భారతి బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ నేతలు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి సహా శాసనసభ్యులు స్పీకర్ కు ధన్యవాదాలు తెలిపారు.

Next Story