- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bhatti Vikramarka : కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం : భట్టి విక్రమార్క
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అంటేనే వ్యవసాయం అని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka).

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అంటేనే వ్యవసాయం అని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka). నేడు హైదరాబాద్ లోని సెక్రటేరియట్ సమీపంలో ఏర్పాటు చేసిన 'రైతు నేస్తం'(Raithu Nestam) సభలో భట్టి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీకి రైతులతో విడదీయరాని సంబంధం ఉందని భట్టి పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం రుణమాఫీ, మద్దతు ధర, రైతు భరోసా(Raithu Bharosa), వడ్లకు బోనస్, ఉచిత కరెంట్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని, సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నామని తెలిపారు.
రైతు భరోసా పథకం కింద 67.01 లక్షల మంది రైతులకు 9 రోజుల్లోనే రూ. 9 వేల కోట్లు జమ చేశామని వెల్లడించారు. 1034 వేదికల్లో 'రైతు నేస్తం' కార్యక్రమాల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంట నష్టంపై పరిహారం ఇవ్వలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అకాలవర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.






