సర్పంచ్ ఎన్నికలు.. మూడో విడతలోనూ కాంగ్రెస్ ఆధిక్యం

by Muthe.Rajitha |

తెలంగాణలో నేడు మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా.. ఈ విడతలోనూ కాంగ్రెస్ మద్దతుదారులు స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించారు.

సర్పంచ్ ఎన్నికలు.. మూడో విడతలోనూ కాంగ్రెస్ ఆధిక్యం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో నేడు మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా.. ఈ విడతలోనూ కాంగ్రెస్ మద్దతుదారులు స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించారు. మొత్తం 4,158 సర్పంచ్ స్థానాల్లో భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాల్‌పల్లి, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులు ఎక్కువ స్థానాలు గెలుచుకున్నారు.

రాత్రి 7 గంటల వరకు వచ్చిన ఫలితాల ప్రకారం ఏకగ్రీవాలను కలుపుకుని కాంగ్రెస్ 1760 సర్పంచ్ స్థానాలు దక్కించుకోగా, బీఆర్ఎస్ 900, బీజేపీ 165, ఇతరులు 360 స్థానాల్లో విజయం సాధించారు. కాగా మూడో విడతలో మొత్తం 182 మండలాల్లో 4,159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదల కాగా.. 11 చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,752 సర్పంచ్ స్థానాలకు బుధవారం పోలింగ్ జరిగింది. అనేక చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది.

Next Story