- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Revanth Reddy: తెలంగాణ మోడల్ సామాజిక న్యాయానికి కాంగ్రెస్ అగ్రనేతల సంపూర్ణ మద్దతు: రేవంత్ రెడ్డి
తెలంగాణ మోడల్ సామాజిక న్యాయానికి కాంగ్రెస్ అగ్రనేతల సంపూర్ణ మద్దతు ఉన్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఓబీసీలకు రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ మోడల్ సామాజిక న్యాయం కోసం అన్ని చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం పూర్తి మద్దతు, నిబద్ధతను వ్యక్తం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలోని బృందం ఇవాళ ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge), రాహుల్ గాంధీతో (Rahul Gandhi) భేటీ అయింది. ఈ సందర్భంగా తెలంగాణలో జరిగిన కులగణన, బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్ ఉన్న అంశాలను వారితో చర్చించారు. ఈ భేటీ అనంతరం ఎక్స్ వేదికగా పోస్టు చేసిన రేవంత్ రెడ్డి.. ఈరోజు పార్టీ పెద్దలతో జరిగిన చర్చలను గేమ్ చేంజర్ డిస్కషన్ గా అభివర్ణించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన స్వతంత్ర భారతదేశంలోనే మొట్టమొదటిదని తెలిపారు. ఈ సర్వే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు దారి తీసిందని.. రాహుల్ గాంధీ, ఖర్గే నాయకత్వంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న తెలంగాణ ప్రభుత్వ డిమాండ్ ను కేంద్రం అంగీకరించక తప్పదన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారా సమాజంలో చారిత్రాత్మక మార్పులు తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని ఇప్పుడు ఓబీసీలకు న్యాయం, సాధికారత కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ సంకల్పించిందని పేర్కొన్నారు.






