- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతిపక్షాలే ఉండకూడదన్నదే మోదీ లక్ష్యం.. అభివృద్ధికి సహకరించమంటే రాజకీయాలా?
దేశంలో ఇతర రాజకీయ పార్టీలు ఉండవద్దు అనే లక్ష్యంతో మోదీ పని చేస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ కోసం, అభివృద్ధి కోసం మోదీని సహకరించాలని కోరారన్నారు.

- ఏకపార్టీగా బీజేపీ ఉండాలన్నదే మోదీ భావన : భువనగిరి ఎంపీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి
- తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకవు, మళ్లీ గెలిచేది కాంగ్రెస్సే : ప్రభుత్వ విప్, బీర్ల ఐలయ్య
దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలో ఇతర రాజకీయ పార్టీలు ఉండవద్దు అనే లక్ష్యంతో మోదీ పని చేస్తున్నారని, సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ కోసం, అభివృద్ధి కోసం మోదీని సహకరించాలని కోరారని, కానీ, రాజకీయాలు మాట్లాడనని చెప్పిన మోదీ రాజకీయాలు మాట్లాడారని భువనగిరి ఎంపీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా గుజరాత్ మోడల్ కి సహకరించారో ఇప్పుడు తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి మోడీని కోరారని , మన్మోహన్ సింగ్ ఇచ్చినట్లు ఇస్తే ఇప్పుడు ఇచ్చే దాంట్లో సగం కూడా రావు అని మోదీ అనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అనేక జాతీయ సంస్థలు ఏర్పడ్డాయన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప చేసింది ఏం లేదని, ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసి దేశంలో ఏక పార్టీగా బీజేపీ ఉండాలని మోదీ భావిస్తున్నారని ఎంపీ చామల ఆరోపించారు. మీరు అనుకున్నది సాధించాలంటే తనతో కలువు అని రేవంత్ రెడ్డిని మోడీ అన్నారని, దేశంలో ప్రతిపక్ష పార్టీలకు బలమైన నాయకులు ఉండవద్దు అని మోడీ ఉద్దేశ్యమా ఆయన ప్రశ్నించారు. మోదీతో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందా? మోదీ దేశంలో అన్ని రాష్ట్రాలకు ప్రధాన మంత్రి అని, కేంద్రం ఫెడరల్ సిస్టంలో అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గత రెండున్నరేళ్లుగా సందర్భం వచ్చినప్పుడల్లా రేవంత్ రెడ్డి ప్రధాని, కేంద్ర మంత్రులను కలుస్తూ తెలంగాణ రాష్ట్ర పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు విజ్ఞాపన పత్రాలు అందజేశారన్నారు.
తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకవు, మళ్లీ గెలిచేది కాంగ్రెస్సే : ప్రభుత్వ విప్, బీర్ల ఐలయ్య
పశ్చిమ బెంగాల్ లా తెలంగాణను కైవసం చేసుకుంటున్నామని మోదీ పగటి కలలు కంటున్నారని, ఆ రాష్ట్రంలో బీజేపీ ఎలా గెలిచిందో దేశ ప్రజలందరు చూశారని ప్రభుత్వ విప్, బీర్ల ఐలయ్య విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మట్లాడుతూ తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకవని, మళ్లీ గెలిచేది కాంగ్రెస్సే అని, తిరిగి సీఎం అయ్యేది రేవంత్ రెడ్డినే అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఒక కల, తెలంగాణపైన మోదీవి పగటికలలు అని మండిపడ్డారు. ప్రతి రాష్ట్రంలో అధికారం కావాలని వారు అడ్డదారిలో ప్రయత్నం చేస్తున్నారని, వాపును చూసి బీజేపీ బలుపు అనుకుంటోందని బీర్ల ఐలయ్య మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి వచ్చినా కాంగ్రెస్ కు పోటీ కాదని, బీఆర్ఎస్ అవయవదానం వల్లనే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ కి 8 సీట్లు వచ్చాయని ఆయన ఆరోపించారు. పట్టణాల్లో తమ పార్టీ ఉందని బీజేపీ చెప్పుకుందని, కానీ, మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నీ సీట్లు వచ్చాయో తెలుసు అని ఎద్దేవా చేశారు.






