- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్దమైన కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ పార్టీలో పదవుల జాతర సందడి మొదలైంది. ఈనెలాఖరులోగా పార్టీ, ప్రభుత్వ పదవులను భర్తీ చేయడానికి అదిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో కసరత్తు ప్రారంభించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో పదవుల జాతర సందడి మొదలైంది. ఈనెలాఖరులోగా పార్టీ, ప్రభుత్వ పదవులను భర్తీ చేయడానికి అదిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో కసరత్తు ప్రారంభించారు. దీంతో పదవులు ఆశిస్తున్న నాయకులు మంత్రులు, కీలక నేతల చుట్టూ ప్రదక్షిణలు చేయడం ప్రారంభించారు. తనకు ఒక నామినేటెడ్ పదవి ఇవ్వాలని, తమ సామాజిక వర్గానికి గుర్తింపు వచ్చే విధంగా చూడాలని కులం కార్డును కూడా ప్రయోగిస్తున్నారు. ఎమ్మెల్యే పట్టుబడితే పదవి వస్తుందని ఆయనను వేడుకుంటున్నారు. జిల్లాస్థాయి నేతలే కాకుండా రాష్ట్రస్థాయిలో తమకున్న పరిచయాలను దృష్టిలో పెట్టుకొని మరోసారి వారికి తమ కష్టాలను గుర్తుచేస్తున్నారు. ప్రభుత్వ పరంగా గుర్తింపు ఇవ్వాలని, తాను ఆర్థికంగా కూడా నష్టపోయానన్న ఆందోళనను వారి ముందు వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీని నమ్ముకొని ఉన్నామని, పార్టీ ప్రతిపక్షంలో ఉండగా తాము కొట్లాడితేనే పార్టీ అధికారంలోకి వచ్చిందని వారు మంత్రుల ముందు చెప్పుకుంటున్నారు.
పదవుల కోసం ముమ్మర ప్రయత్నాలు..
మరో వైపు ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు తమ అనుచరులకు పదవుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. నామినేటెడ్ పదవి లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మేయర్ తదితర పదవులయినా హామీ ఇవ్వాలని కోరుతున్నారు. చివరికి రాష్ట్ర స్థాయి డైరెక్టర్ పదవి అయినా దక్కకపోతుందా అనే ఆశతో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వందల సంఖ్యలో పదవులు రాబోయే రెండు మూడు వారాల్లో భర్తీ కానున్న నేపథ్యంలో ప్రాథమిక జాబితాను ఎవరికి వారుగా ఎమ్మెల్యేలు, మంత్రులు రూపొందిస్తున్నారు. అయితే మొదటి విడతలో పదవి దక్కని నాయకులు ఈ విడతలోనైనా కలిసివస్తుందా అంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. మొత్తంగా రాబోయే రెండు మూడు వారాలు కాంగ్రెస్ పార్టీలో పదవులు ఆశిస్తున్న ఆశావాహులు, వారందరిని ఏ విధంగా సంతృప్తిపర్చాలో తెలియక ముఖ్య నేతలు టెన్షన్లో ఉన్నట్లుగా సమాచారం.






