- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో కాంగ్రెస్ పెద్దల పాదయాత్ర.. షెడ్యూల్ రిలీజ్
తెలంగాణాలో కాంగ్రెస్ నాయకుల పాదయాత్ర(Padayatra) ఖరారైంది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణాలో కాంగ్రెస్ నాయకుల పాదయాత్ర(Padayatra) ఖరారైంది. ఈ మేరకు పాదయాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను టీపీసీసీ ప్రకటించింది. ఏఐసీసీ(AICC) ఆదేశానుసారం ఈ నెల 31వ తేదీ నుంచి ఉమ్మడి జిల్లాలలో ఒక నియోజక వర్గంలో జిల్లా స్థాయి పాదయాత్ర(Padayatra), శ్రమదానం(Shramadanam) కార్యక్రమాలు నిర్వహించేందుకు టీపీసీసీ(TPCC) ప్రణాళిక రూపొందించింది. ఈ కార్యక్రమాలలో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan), టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఆ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొంటారు.
నిర్ణయించిన తేదీలలో నియోజకవర్గంలోని ఒక ముఖ్యమైన కేంద్రంలో సాయంత్రం 5 గంటల నుంచి 10 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి, అనంతరం అదే ప్రాంతంలో కాంగ్రెస్ కార్యకర్తలతో పల్లె నిద్ర చేయనున్నారు. మరుసటి రోజు తెల్లవారు జామున లేచి గ్రామంలో పెద్ద ఎత్తున శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం ఆ జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు, మండలం అధ్యక్షుడు, డీసీసీ సభ్యులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, గ్రామ సర్పంచులు.. ఇలా ఆ ఉమ్మడి జిల్లాకు చెందిన కీలక నేతలతో సమావేశం నిర్వహించి, సాయంత్రం మరో నియోజకవర్గంలో పాదయాత్ర కార్యక్రమాలు చేపట్టనున్నారు. మొదటి విడతగా ఆరు జిల్లాల్లో ఒక్కో నియోజక వర్గాన్ని ఎంపిక చేసుకొని జిల్లా స్థాయి కార్యక్రమాలు నిర్వహించాలని ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది.






