తెలంగాణలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ.. TPCC గ్రాండ్ వెల్‌కమ్

by Disha Web Desk 2 |
తెలంగాణలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ.. TPCC గ్రాండ్ వెల్‌కమ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తోన్న ప్రతిష్టాత్మక 'భారత్ జోడో యాత్ర' తెలంగాణలోకి ఎంటర్ అయింది. మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా బ్రిడ్జి మీదుగా తెలంగాణలోకి ప్రవేశించింది. బతుకమ్మలు, బోనాలు, డోలు వాయిద్యాలతో తెలంగాణ కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్‌ గాంధీకి గ్రాండ్‌గా వెల్‌కల్ చెప్పారు. కాగా, తెలంగాణ ఎంట్రీ వద్ద కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ రాహుల్ యాత్రకు విడ్కోలు చెప్పి జాతీయ జెండాను తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డికి అందించారు. ఉదయం 11 గంటలకు నారాయణపేట్ జిల్లా గూడబెల్లూర్‌లో యాత్రకు బ్రేక్ పడనుంది. దీపావళి పండుగ సందర్భంగా 24, 25 తేదీల్లో రాహుల్ గాంధీ యాత్రకు విరామం ఇవ్వనున్నారు. 26వ తేదీన ఏఐసీసీ అధ్యక్షుడిగా ఖర్గే బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రాహుల్ హాజరుకానున్నారు. మళ్లీ తిరిగి 27వ తేదీన తెలంగాణలో రాహుల్ పాదయాత్ర పున:ప్రారంభం అవుతుంది. మొత్తం తెలంగాణ 12 రోజులు, 375 కిలోమీటర్ల పాటు రాహుల్ యాత్ర సాగనుంది. 7 పార్లమెంట్ స్థానాలు, 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. తెలంగాణలో నిర్వహించబోయే పాదయాత్రలో అధినేత్రి సోనియాతో పాటు ప్రియాంక గాంధీ కూడా పాల్గొనాలని టీపీసీసీ కోరింది. నవంబర్ 1వ తేదీన నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహానికి నివాళ్లర్పించే కార్యక్రమంలో పాల్గొనాలని సోనియా, ప్రియాంక గాంధీలకు టీపీసీసీ ఆహ్వానం పంపింది.

ఇవికూడా చదవండి: నేడు తెలంగాణలోకి ఎంటర్ కానున్న రాహుల్ యాత్ర.. రాష్ట్రంలో ఇదే రూట్!


Next Story