- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Congress: బీఆర్ఎస్, బీజేపీ అసలు స్వరూపం ఇదే
ఉప రాష్ట్రపతి ఎన్నిక(Election of Vice President)ల వేళ బీఆర్ఎస్ పార్టీ(BRS Party)పై కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి(Sama Ram Mohan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఉప రాష్ట్రపతి ఎన్నిక(Election of Vice President)ల వేళ బీఆర్ఎస్ పార్టీ(BRS Party)పై కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి(Sama Ram Mohan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ పెట్టారు. ‘‘బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం బట్టబయలు అయింది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండటం పరోక్షంగా బీజేపీకి మేలు చేయడమే. ఇది చెడ్డీలు వేసుకొని రాజకీయాలను టీవీలో చూసే పిల్లవాడికి కూడా తెలుసు. ఇదే బీఆర్ఎస్ అసలు స్వరూపం’’ అని ట్వీట్‌లో రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. రేపు జరుగనున్న భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్డీఏ, ఇండియా కూటమి.. రెండూ తెలంగాణకు ద్రోహం చేశాయంటోన్న బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో తటస్థ వైఖరి అవలంభించాలని చూస్తున్నట్టు సమాచారం. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్‌కు రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్న సంగతి తెలిసిందే.






