సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. BRS ఆఫీస్‌పై కాంగ్రెస్ నాయకుల దాడి

by Gantepaka Srikanth |   (  Updated:2025-01-11 11:03:55  IST  )

భువనగిరి BRS ఆఫీస్‌పై కాంగ్రెస్ నాయకుల దాడి చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేశారు.

సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. BRS ఆఫీస్‌పై కాంగ్రెస్ నాయకుల దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: భువనగిరి BRS ఆఫీస్‌పై కాంగ్రెస్ నాయకుల దాడి చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేశారు. బీఆర్ఎస్ ఆఫీస్‌లోని ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై బీఆర్ఎస్ (BRS) భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్‌ కార్యకర్తలు వెనక్కి తీసుకోవాలని.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శనివారం భువనగిరి పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసి కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని అదుపు చేశారు.

Next Story