కుంటిసాకులు మాకెందుకు?.. అధిష్టానంపై కాంగ్రెస్ నేతలు సీరియస్

by Gantepaka Srikanth |

అధికార కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకం ముందుకు సాగడం లేదు.

కుంటిసాకులు మాకెందుకు?.. అధిష్టానంపై కాంగ్రెస్ నేతలు సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అధికార కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకం ముందుకు సాగడం లేదు. రేపు మాపు అంటూ రోజులు వెల్లదీస్తున్నారు. కింది స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు వివిధ పదవులు, వాటి ఆమోదానికి ఇతర అంశాలు ముడిపడి ఉండటంతో పదవుల పంపకం ప్రక్రియ ముందుకు సాగడం లేదని సమాచారం. గతనెల 8న జరిగిన పొలిటికల్​ఎఫెర్స్​కమిటీ (పీఏసీ) సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​హాజరై పార్టీ పదవులను, నామినేటెడ్​పదవులను వెంటనే భర్తీ చేయాలని సూచించారు. దానికి అనుగుణంగా పదవుల పంపకంపై కసరత్తు చేసి తమకు జాబితా ఇస్తే వెంటనే ఆమోదిస్తామని ప్రకటించారు. పీఏసీ సమావేశం జరిగి ఐదు నుంచి ఆరు వారాలు కావొస్తున్నా ఏ పదవుల భర్తీ ముందుకు సాగలేదు. పీసీసీ కార్యవర్గం భర్తీ పూర్తయింది. ఒకట్రెండు రోజుల్లో ఆదేశాలు వస్తాయని, దాదాపుగా 2 వారాల నుంచి లీకులు ఇస్తున్నా నేటికీ ముహూర్తం కుదరలేదు. ముందుగా పీసీసీ కార్యవర్గం, ఆ తర్వాతే నామినేటెడ్​పోస్టులను భర్తీ చేస్తారని అంచనా వేసినా.. అందుకు అనుగుణంగా కసరత్తు చేశారు. కానీ ఏదీ ముందుకు పడలేదు.

నేతల మధ్య సమన్వయలోపం..

పీసీసీ కార్యవర్గంలో వర్కింగ్​ప్రెసిడెంట్లపై కసరత్తు కొలిక్కి వచ్చినట్లే వచ్చి ఆగిపోయిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పీసీసీ కార్యవర్గం పూర్తయితే అనంతరం జిల్లాలు, సామాజికవర్గాల వారీగా నామినేటెడ్​ పోస్టుల భర్తీ జరిగే చాన్స్ ఉంటుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. పార్టీ అధికారంలోకి ఏడాది దాటింది. మొదటి దఫా పోస్టులు భర్తీ చేయగా.. పార్లమెంట్​ఎన్నికల తర్వాత వారంతా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఒకటి రెండు పోస్టులను భర్తీచేశారు. కానీ, పెద్ద ఎత్తున భర్తీ జరగలేదు. ఫలితంగా అనేక చైర్మన్, డైరెక్టర్​పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. పోస్టుల భర్తీ పూర్తయితే ఇన్నాళ్లూ తాము పడిన కష్టానికి గుర్తింపు లభించినట్లు అవుతుందని కేడర్ భావిస్తోంది. కానీ, ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. కేడర్, పార్టీ నేతలకు మధ్య సమన్వయం కుదరకపోవడం, సామాజిక జిల్లా సమీకరణాలు సెట్​కాకపోవడం, ఎవరికి వారు తాము చెప్పిన వారికే పదవులు దక్కాలి, మేం చెబితే ఇవ్వరా? అనే ధోరణితో పట్టుబట్టడం వలన సమీకరణాలు సెట్ కాక పదవుల భర్తీ ఆర్ధాంతరంగా నిలిచిపోయిందని తెలుస్తోంది.

కుంటిసాకులు మాకేందుకు?

దీంతో పార్టీ కేడర్​తీవ్ర అసంతృప్తితో ఉందని సమాచారం. ముఖ్య నేతలకు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులు దక్కాయి. కానీ, తమ వరకు వచ్చే సరికి జాప్యం చేస్తున్నారని, కుంటి సాకులు చెబుతున్నారని కేడర్​ఆందోళన వ్యక్తం చేస్తున్నది. పదవుల జాప్యం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని ఆశావహులు చెబుతున్నారు. నేతలను కూర్చోబెట్టి, సర్దిచెప్పి అడ్డంకిగా ఉన్న అంశాలను పరిష్కరించి, పదవుల భర్తీ జరిగేలా చూడాలని కోరుతున్నారు. నామినేటెడ్​పోస్టుల పరిస్థితి ఇలా ఉండగా మరోవైపు మంత్రివర్గం విస్తరణ సైతం ఆలస్యం అవుతూనే ఉన్నది. ప్రభుత్వం కొలువుదీరిన కొత్తలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. నేటికీ అవే శాఖలు కొనసాగుతున్నాయి. మరో ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నా.. ఆ అంశం వాయిదా పడుతూ వస్తున్నది. మంత్రి పదవులతో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్​విప్ లాంటి ముఖ్యమైన పోస్టుల సైతం ఖాళీగానే ఉన్నాయి. ఇక్కడా నాయకులను కూర్చోబెట్టి సర్ధి చెప్పే పరిస్థితి లేకపోవడంతో భర్తీ ప్రక్రియ ముందుకు సాగడం లేదని తెలిసింది.

Next Story