- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది: సునీతరావు
ప్రజలపై ఆర్థిక భారం పడేలా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ధరలను వెంటనే తగ్గించాలని మహిళా కాంగ్రెస్అధ్యక్షురాలు సునీత రావు పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలపై ఆర్థిక భారం పడేలా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్‌ధరలను వెంటనే తగ్గించాలని మహిళా కాంగ్రెస్అధ్యక్షురాలు సునీత రావు పేర్కొన్నారు. మహిళా కాంగ్రెస్ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సునీతరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.400 ఉన్న గ్యాస్‌సిలిండర్‌ను మోడీ ప్రభుత్వం 9 ఏళ్లలో రూ.1200కు పెంచడం దారుణమన్నది. పెంచిన సిలిండర్‌ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌చేశారు.
కాంగ్రెస్సీనియర్నేత పుష్పలీల మాట్లాడుతూ.. బీజేపీ పెంచిన ధరలను పరిశీలిస్తే ప్రజలపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ప్రేమ స్పష్టంగా అర్థమవుతుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ప్రభుత్వాలు రెండూ ఒకటేనని, ప్రజలకు గమనించాలని కోరారు. మళ్లీ కట్టెలతో వంట చేసే పరిస్థితి వచ్చిందన్నారు. టీపీసీసీ స్పోక్స్పర్సన్కాల్వ సుజాత మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ది చెప్పే సమయం ఆసన్నమైందని, ప్రజలంతా అలెర్ట్‌గా ఉండాలని కోరారు.






