- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ కోసం దేవుడితో అయినా పోరాడుతాం: కాంగ్రెస్ నేత
నల్గొండ, పాలమూరు జిల్లాల రైతుల ద్రోహి హరీష్ రావు అని కాంగ్రెస్ నేతల ఆరోపన

దిశ, వెబ్‌డెస్క్: సాగునీటి ప్రాజెక్టు(Irrigation Project)లపై హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. తెలంగాణను ఆంధ్రాతో కలిపిన అనంతరం ఈ ప్రాంతానికి మేలు చేసే ప్రాజెక్టులను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేసి మరణశాసనం రాసిందని ఆయన మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్(Chanagani Dayakar) స్పందించారు. ఆదివారం దయాకర్ గాంధీ భవన్‌లో మాట్లాడారు. నల్గొండ, పాలమూరు జిల్లాల రైతుల ద్రోహి హరీష్ రావు అని అన్నారు. అసెంబ్లీలో మొఖం చెల్లకనే పారిపోయాడని విమర్శించారు. పదేళ్లు అధికారంలోకి ఉన్న హరీష్ రావు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.
చేపలకూర కోసం తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు
ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్, హరీష్ రావు ఇద్దరూ జేబులు నింపుకున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై ఉన్న ప్రేమ నల్లగొండ జిల్లా, పాలమూరు జిల్లాల మీద ఎందుకు లేదని అడిగారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువగా.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనే నల్లగొండ, పాలమూరు జిల్లాలకు అన్యాయం జరిగిందని అన్నారు. ఆంధ్రా నాయకుల ఇళ్లలో చేపలకూర తిని.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో నల్లగొండ, పాలమూరు జిల్లాల రైతుల కాళ్లను కృష్ణా జలాలతో కడుగుతాం అని కీలక ప్రకటన చేశారు. తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరుగనివ్వం, ఈ విషయంలో దేవుడితో అయినా పోరాటం చేస్తామని అన్నారు.






