- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో.. కాంగ్రెస్ నేత వార్నింగ్
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి ఖండించారు. కౌశిక్ రెడ్డి మతిబ్రమించి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు.

దిశ, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి ఖండించారు. కౌశిక్ రెడ్డి మతిబ్రమించి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. అర్థరాత్రి రేవంత్ ఏదో పూజకు వెళ్లాడని అంటున్నాడని, అలా వెళ్లడానికి రేవంత్ రెడ్డి ఏం కేటీఆర్ కాదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ సర్కార్ లో పనిచేస్తున్న మంత్రులంతా ఏ విధంగా పనిచేస్తున్నారో అందరికీ తెలుసని అన్నారు.
24గంటల్లో పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే సన్నబియ్యం తీసుకున్న ప్రజలే కొడతారని మండిపడ్డారు. ఉచిత బస్ ఎక్కుతున్న మహిళలంతా కలిసి కొడుతారని వ్యాఖ్యానించారు. మీ ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సిన కర్మ ఏం ఉందని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా మీ అన్న కేటీఆర్ దే అని వ్యాఖ్యానించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, మంత్రులకు సీఎం రేవంత్ పై ఎంత గౌరవం ఉందో అందరికీ తెలుసని అన్నారు. లేదంటే ఉరికించి కొట్టడానికి యూత్ కాంగ్రెస్ ఎక్కడ నుండి వస్తారో తెలియని వార్నింగ్ ఇచ్చారు.






