- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టులను ఎందుకు చంపుతున్నారు?.. కేంద్రంపై రేణుకా చౌదరి సీరియస్
ఆపరేషన్ కగార్(Operation Kagar)పై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి(Renuka Chowdhury) హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ కగార్(Operation Kagar)పై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి(Renuka Chowdhury) హాట్ కామెంట్స్ చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాలన ఆదర్శంగా నిలిచిందని అన్నారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) డిమాండ్‌తోనే దేశంలో కేంద్రం కులగణన(Caste Census)కు సిద్ధమైందని తెలిపారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు మేలు చేసే పనులు చేస్తోందని కొనియాడారు. అనవసరంగా ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తే.. బీఆర్ఎస్ నేతల తోకలు కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని నిలువునా దోచుకున్నారని మండిపడ్డారు. బనకచర్ల ద్వారా తెలంగాణ హక్కులు కేసీఆర్ తాకట్టు పెట్టారని విమర్శించారు. అసలు కవిత పార్టీ పెట్టడానికి స్పాన్సర్ ఎవరని ప్రశ్నించారు.
మావోయిస్టులను ఎందుకు చంపుతున్నారు?
ఆపరేషన్ కగార్‌పైనా రేణుకా చౌదరి హాట్ కామెంట్స్ చేశారు. మావోయిస్టులను కేంద్రం నిర్ధాక్షిణ్యంగా చంపుతోందని మండిపడ్డారు. నిర్భయంగా మన దేశంలోకి వచ్చి.. మన 28 మంది పౌరులను చంపిన ఉగ్రవాదులను పట్టుకోలేదు. వారి కోసం కనీసం గాలించడం కూడా లేదు. మన దేశ పౌరులైన మావోయిస్టులను మాత్రం చంపేస్తున్నారు. కనీసం వారితో చర్చలు కూడా చేయడం లేదని మండిపడ్డారు.






