- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కలెక్టర్ కాళ్లు మొక్కిన కాంగ్రెస్ నేత.. ఎందుకోసమంటే..?
వడగళ్ల వానలతో కరీంనగర్ రైతులు తీవ్రంగా నష్టపోయారని.. వారిని తక్షణమే ఆదుకోవాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి కలెక్టర్ కాళ్లపై పడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: వడగళ్ల వానలతో కరీంనగర్ రైతులు తీవ్రంగా నష్టపోయారని.. వారిని తక్షణమే ఆదుకోవాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి కలెక్టర్ కాళ్లపై పడ్డారు. ఈ ఘటనతో కలెక్టర్ ఒక్కసారి దిగ్భ్రాంతికి గురయ్యారు. ‘వ్యవసాయ క్షేత్రాల్లో పంట నష్టం, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొట్టుకుపోయింది. వాటిని పరిశీలించేందుకు వస్తున్న నేతల ముందు రైతులు కన్నీళ్లు పెట్టుకోవడమే కాదు, తమను ఆదుకోవాలని కాళ్ళపై పడుతున్నారు. వారి ఆవేదనను అర్థం చేసుకోండి’ అంటూ కృష్ణారెడ్డి కలెక్టర్ ముందు మోకాళ్ళపై కూర్చుండిపోయారు. నష్టపోయిన పంటలకు పరిహారం ఇప్పించాలని, జిల్లాలో రైతుల పరిస్థితిని తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు రావాలని, రైతులకు భరోసా కల్పించాలని ఆయన కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






