‘చాలా వెనుబడిపోయాం.. దయచేసి మమ్మల్ని గుర్తించండి’

by Gantepaka Srikanth |

తెలంగాణ వ్యాప్తంగా వెనుకబడి ఉన్న తమ కులానికి రాజకీయంగా అవకాశాలు కల్పించాలని బేడ(బుడగ) జంగం హక్కు పోరాట సమితి(బీజేహెచ్​పీఎస్) తెలంగాణ అధ్యక్షుడు కడమంచి సహదేవుడు కోరారు.

‘చాలా వెనుబడిపోయాం.. దయచేసి మమ్మల్ని గుర్తించండి’
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా వెనుకబడి ఉన్న తమ కులానికి రాజకీయంగా అవకాశాలు కల్పించాలని బేడ(బుడగ) జంగం హక్కు పోరాట సమితి(బీజేహెచ్​పీఎస్) తెలంగాణ అధ్యక్షుడు కడమంచి సహదేవుడు కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆయన ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌ను ప్రత్యేకంగా కలిశారు. సంచార జాతులైన తాము ఎస్సీలలో ఉన్నప్పటికీ ఎంతో వెనుబడి పోయామని, తమను ఎవరూ గుర్తించడం లేదన్నారు. రాజకీయంగా కాంగ్రెస్​పార్టీకి అండగా తమకు గుర్తింపు లేదని, ఏ ఒక్కరి కనీసం గ్రామస్థాయిలో సైతం పదవులు దక్కినది లేదని ఆవేదన చెందారు. ఆర్థిక, విద్య, వ్యాపార పరంగా ఎదగలేదని, తమరైన గుర్తించి న్యాయం చేయాలని ఆమెను కోరారు. దీనికి మీనాక్షి నటరాజన్​సానూకులంగా స్పందించారని, తగిన న్యాయం జరిగేలా చూస్తానని ఆమె హామీ ఇచ్చారని సహదేవుడు తెలిపారు.

Next Story