- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ చేసింది చిన్న పొరపాటు కాదు: మల్లు రవి
బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేత మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు చేసిన తప్పులను ఒప్పుకొని కాళేశ్వరం సందర్శన మానుకోవాలని హితవు పలికారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేత మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు చేసిన తప్పులను ఒప్పుకొని కాళేశ్వరం సందర్శన మానుకోవాలని హితవు పలికారు. అసలు కాళేశ్వరం ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తాము కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను సందర్శించి తప్పులను ప్రజల ముందు పెట్టామని చెప్పారు.
చేసిందంతా చేసి ఇప్పుడు కాళేశ్వరం పోయి ఏం చేస్తారని మండిపడ్డారు. ఇప్పటికైనా చేసిన తప్పులను ఒప్పుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని.. కాళేశ్వరం అవినీతిలో భాగస్వాములైన వారిని అందరిపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసీఆర్, కేటీఆర్ చెప్పినట్లు చేయరని.. నిపుణుల కమిటీ నివేదికే ఫైనల్ అని అన్నారు. కాళేశ్వరం విషయంలో జరిగింది చిన్న పొరపాటు కాదని అన్నారు.






