కేసీఆర్.. టైమ్ వచ్చింది.. ఇక సామాన్లు సర్దుకో: మహేష్​ కుమార్​ గౌడ్​ ఫైర్

by Disha Web Desk 19 |
కేసీఆర్.. టైమ్ వచ్చింది.. ఇక సామాన్లు సర్దుకో: మహేష్​ కుమార్​ గౌడ్​ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ​ప్రభుత్వం పాలనకు అతి త్వరలో విముక్తి కలగనున్నదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్​ కుమార్ ​గౌడ్​ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌కు సామాన్లు సర్దుకునే సమయం వచ్చిందని, ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్​జెండా ఎగురనున్నదని స్పష్టం చేశారు. గత కొన్ని రోజుల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులను ఇబ్బంది పెడుతున్నదని ఆయన వెల్లడించారు. అక్రమంగా అరెస్టులు చేస్తూ కేసులు పెడుతూ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని బీఆర్ఎస్ అనేక విధాలుగా ప్రయత్నం చేస్తుందన్నారు. కానీ ఈ నియంత పాలన మరికొన్ని రోజులేనని, ప్రజాస్వామిక పాలన రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు.

ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌తో పాటు కాంగ్రెస్ నాయకుల అరెస్ట్‌లను ఆయన ఖండించారు. ఇంత నియంత పాలన ఎన్నడూ లేదన్నారు. గద్వాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే జిల్లాలోని కాంగ్రెస్ నాయకులను, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ను హౌస్ అరెస్టులు చేయడం తెలంగాణలోని నియంత పాలనకు పరాకాష్ట అని మండిపడ్డారు. రాజ్యాంగం ప్రకారం ప్రజలకు ఇచ్చిన కనీస హక్కులను కూడా కాలరాస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టులు చేసి ప్రజాస్వామ్య విధానాలను తుంగలో తొక్కుతున్నారన్నారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు మాట్లాడకుండా చేస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకుల అరెస్టులు బంద్​పెట్టి, ప్రజా సమస్యలపై ఫోకస్​పెట్టాలని మహేష్ కుమార్​గౌడ్ వెల్లడించారు.

Also Read..

బీఆర్ఎస్కు షాక్.. కాసాని సమక్షంలో ఆ నేత టీడీపీలో చేరిక

Next Story

Most Viewed