‘తెలంగాణ నెక్ట్స్ సీఎం అతనే’.. మాజీ ఎంపీ మధుయాష్కీ జోస్యం

by Gantepaka Srikanth |

తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, రేవంత్ రెడ్డి తిరిగి సీఎం అవుతారని మాజీ ఎంపీ మధుయాష్కీ అన్నారు.

‘తెలంగాణ నెక్ట్స్ సీఎం అతనే’.. మాజీ ఎంపీ మధుయాష్కీ జోస్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, రేవంత్ రెడ్డి తిరిగి సీఎం అవుతారని మాజీ ఎంపీ మధుయాష్కీ అన్నారు. దేశంలో బెస్ట్ సీఎంగా రేవంత్ రెడ్డికి పేరుందని, ఆయన అమోఘంగా పని చేస్తున్నారన్నారు. శనివారం గాంధీ భవన్‌లో మధుయాష్కీ మీడియాతో చిట్ చాట్ చేశారు. తెలంగాణలో బీజేపీ చాపకింద నీరులాగా పెరుగుతుందని, కాంగ్రెస్‌కు నెక్స్ట్ పోటీ బీజేపీతో ఉంటుందన్నారు. కవిత ఇంటి నుండి బయటకు రావడం అనేది కేసీఆర్ రచించిన నాటకమేనని మధుయాష్కీ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో జీరో సీట్లు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ కూడా పెట్టని తీరుతో అస్తిత్వం కాపాడుకోవడానికి, ఏ విధంగా అధికారంలోకి రావాలి అని కేసీఆర్, బీఆర్ఎస్ చూస్తుందని ఆయన తెలిపారు. కవిత ఆరు నెలలకింద అన్నపైనా అలిగిందని.. ఇప్పుడు బావ పైనా మాట్లాడుతోందని.. కళింకితులు సారా కుంభకోణంలో చిక్కుకున్న వాళ్ళు నీతులు చెప్తున్నారని మధుయాష్కీ మండిపడ్డారు. విమలక్క లాంటి వాళ్ళు పార్టీ పెడితే ఆదరిస్తారు, కానీ, లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్న కవిత పార్టీ పెడితే ఎవరు ఆదరించరన్నారు.

అశోక్ నగర్‌లో విమలక్క సామాజిక బతుకమ్మ పేరుతో ఆఫీస్ పెడితే బలవంతంగా ఖాళీ చేయించించారని, దోచుకున్న డబ్బును దాచుకోవడానికే కవిత జాగృతి సంస్థను పెట్టిందని ఆయన ఆరోపణలు గుప్పించారు. నాగార్జున ఎన్​కన్వెన్షన్ నోటీసులు ఇచ్చి రైతుల పేరుమీద జాగృతికి డబ్బులు తీసుకున్నారని, ఏఒక్క రైతుకు ఒక్క పైసా ఇవ్వలేదని మధుయాష్కీ ఆరోపించారు. కనీసం తీన్మార్ మల్లన్నను ఎవరైనా నమ్ముతారు కానీ. చనిపోయిన రైతు కుటుంబాల డబ్బులు కాజేసిన కవితను ఎవరూ నమ్మతారన్నారు. ఇప్పటి వరకు కవిత బలహీన వర్గాలకు ఏమి చేసిందని బలహీన వర్గాలు ఆమె వెంట ఉంటారన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి బీసీలను మోసం చేసిన వాళ్ళు.. ఇప్పుడు మాటలు చెబితే నమ్మరని మధుయాష్కీ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామని బీఆర్ఎస్‌కు భయపడుతుందని, కలకాలం కల్వకుంట్ల కుటుంబం అధికారంలో ఉండాలని తెలంగాణను కేసీఆర్​దోచుకున్నారన్నారు.

తమ సీఎం ఎవరి వెనకాల ఉండబోరని, ఆయన స్ట్రెయిట్ ఫార్వర్డ్ అన్నారు. బీసీల కోసం నిజంగా పని చేసిన వారే బీసీ నాయకులని, పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు కవితకు బీసీలు గుర్తొచ్చారా...? కేసీఆర్ హాయంలో అత్యధికంగా నష్టపోయింది బీసీలేనని, బలహీన వర్గాలకు రేవంత్ రెడ్డి ఛాంపియన్ అయ్యారన్నారు. కాంగ్రెస్ లోకల్‌గా విచారణ చేస్తే రాజకీయ కక్ష అన్నారని, ప్రభుత్వం కాళేశ్వరం అంశాన్ని సీబీఐ విచారణకి ఇచ్చాక కూడా కిషన్ రెడ్డి, బండి సంజయ్ చప్పుడు చేయట్లేదని, గతంలో కాంగ్రెస్ సీఎం వీరభద్ర సింగ్ కూతురు పెళ్లి జరగకుండా సీబీఐ అడ్డుకుందని మధుయాష్కీ గుర్తుచేశారు.

Next Story