- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణకు మాత్రం అడ్డంకులు ఎందుకు? బీసీ బిల్లుపై తెలుగులో ట్వీట్ చేసిన కాంగ్రెస్ అగ్రనేత
తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు బిల్లుపై కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల (BC Reservation Bill) పెంపు బిల్లుపై కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ (Jairam Ramesh) స్పందించారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఎక్స్ వేదికగా తెలుగులో ఆసక్తికర పోస్ట్ వేశారు. ఈ మేరకు ఆయన కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను ప్రశ్నించారు. 2023 నవంబర్ 9న, బీహార్ అసెంబ్లీ, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీలు, వెనుకబడిన వర్గాలకు (ఈబీసీ) రిజర్వేషన్లు 65%కి పెంచే బిల్లును ఆమోదించిచారని తెలిపారు. నవంబర్ 10, 2023న లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఆమోదం తెలిపిందన్నారు. గవర్నర్ తన సమ్మతి ఇచ్చిన తర్వాత, ఆ బిల్లు 2023 నవంబర్ 21న అధికారికంగా చట్టంగా మారిందని పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో 2025 మార్చి 17న షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన వర్గాల (బీసీ) రిజర్వేషన్లను 67%కి (ఇందులో 42% బీసీలకు రిజర్వేషన్) పెంచే బిల్లును ఆమోదించిందని తెలిపారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ మరుసటి రోజే ఆమోదం తెలిపిందని, మార్చి 30, 2025 న గవర్నర్ ఆ బిల్లును భారత రాష్ట్రపతికి సమ్మతి కోసం పంపారని గుర్తుకుచేశారు. నాలుగు నెలలు గడిచినా సమ్మతి ఇప్పటికీ రాలేదని తెలిపారు. బీహార్ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు నితీశ్ కుమార్ ఇంకా పార్టీ మార్పు చేయకుండా జేడీయూ, ఆర్జేడీ, ఐఎన్సీ కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు.
బీహార్‌లోని సామాజిక వాస్తవాల దృష్ట్యా, ఆ బిల్లుకు గవర్నర్ సమ్మతిని ఆలస్యం చేయించడం లేదా అడ్డుకోవడం బీజేపీకి సాధ్యం కాలేదన్నారు. గవర్నర్ ఆ బిల్లును రాష్ట్రపతి సమ్మతి కోసం పంపలేదని గమనించడం ముఖ్యమన్నారు. అయితే, తెలంగాణలో మాత్రం బీజేపీ అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. ఇది తమ సామాజిక న్యాయానికి కట్టుబాటు ఎంత వరకు ఉందో బయటపెడుతోందని, రాష్ట్రపతి సమ్మతి కోసం నాలుగు నెలలకు పైగా ఎందుకు నిలిపివేశారు? అని ప్రశ్నించారు.






