- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేమే హీరో, మేమే విలన్.. జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి మండిపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి మండిపడ్డారు. రాహుల్ గాంధీపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదన్నారు. సోమవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో డూప్లికేట్ గాంధీలు అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ వయసులో పెద్ద వారని మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలన్నారు. రాహుల్ గాంధీ కుటుంబానికి ఓ చరిత్ర ఉందని, ఆ కుటుబంపై కేసీఆర్ మాట్లాడి తనకున్న కొద్దిపాటి గౌరవాన్ని కోల్పోవద్దన్నారు. రాష్ట్ర విభజన జరాగాలని రాహుల్, సోనియా గాంధీ ఇంటి చుట్టూ తిరిగిన రోజులు కేసీఆర్ మర్చిపోయారా? అని ప్రశ్నించారు. తెలంగాణ విభజన కోసం ఒప్పించేందుకు నెలల తరబడి వారి కోసం ఢిల్లీలో ఎదురు చూసిన రోజులు మర్చిపోయారా? రాష్ట్ర విభజనకు ముందు వాళ్లు ఒరిజినల్ గాంధీలు ఇప్పుడేమో? డూప్లికేట్ గాంధీలా ఇదేనా కేసీఆర్ మీరు నేర్చుకున్న రాజకీయ విలువలు అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ తెలంగాణ ఇవ్వాలన్న సూచనతోనే ప్రక్రియ మొదలైందన్నారు. ఆ సమయంలో రాహుల్.. సోనియా గాంధీ దేవుళ్ళు అన్నావు.. ఇప్పుడు కేసీఆర్ కడుపు నిండి ఉన్నది కాబట్టి దయ్యాలు అయ్యారా? అని పేర్కొన్నారు. కేసీఆర్ అనవసరంగా మాట తూలుతున్నారు.. నీ పార్టీకి నువ్వు ఎట్లా ప్రచారం చేశావో.. మా పార్టీకి రాహుల్ గాంధీ ప్రచారం చేశారని చెప్పారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడిన మాటలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్చేశారు. బీఆర్ఎస్ఢిల్లీకి సంచులు మోయలేదా..? ఢిల్లీకి, ఒరిస్సా, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు.. డబ్బులు పంపింది నువ్వు కాదా..? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో హీరో, విలన్ అన్ని కాంగ్రెస్ పార్టీనే అని అంటున్నారు. ప్రజల కోసం హీరో పాత్ర, ప్రతిపక్షాల పాలిట విలన్ల పాత్రలో మేమే ఉంటామన్నారు.






