- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన ప్రకటన
కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై చర్చించే పరిస్థితే లేకుండా పోయిందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి(Jagga Reddy) ఆవేదన చెందారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ పాలనలో ప్రజల అవసరాలు.. రైతులు.. మహిళలు.. యువత ఉద్యోగాలపై చర్చ చేయడం లేదని అన్నారు. స్వాతంత్రం కోసం ఆస్తి.. ప్రాణాలు ధారాదత్తం చేసిన నెహ్రూను టార్గెట్ చేసి బీజేపీ పని చేస్తోందని విమర్శించారు. వందేమాతరంపై చర్చలో ప్రియాంక గాంధీ ధీటుగా సమాధానం చెప్పిందని అన్నారు. నెహ్రూ ఐపోయింది.. ఇప్పుడు మహాత్మా గాంధీ వరకు వచ్చారని ఎద్దేవా చేశారు. మహాత్మా గాంధీ ఉన్నప్పుడు పుట్టని వాళ్ళు ఆయన మీద.. నెహ్రూ మీద మాట్లాడుతున్నారని అన్నారు. దేశ ప్రజలు ఆలోచన చేయాలని కోరారు.
1930లోనే ఉప్పు సత్యాగ్రహం చేసిన గాంధీ గురించి.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పుట్టిన మోడీ.. అమిత్ షాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. మోడీ.. అమిత్ షాలు నెహ్రూ.. గాంధీని టార్గెట్ చేస్తూ రాజకీయాల్లో వీళ్ల పేర్లు వినపడకుండా చేయాలని చూస్తున్నారని అన్నారు. ప్రజలకు సేవ చేస్తారనే ఉద్దేశంతో మూడుసార్లు మోడీకి అవకాశం ఇస్తే.. నెహ్రూ, గాంధీని టార్గెట్ చేస్తూ ఓట్ల రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇందుకేనా మీకు అధికారం ఇచ్చిందని అన్నారు. నెహ్రూ, గాంధీలపై మోడీ కుట్రలకు నిరసనగా సంగారెడ్డిలో సభ పెట్టబోతున్నా అని ప్రకటించారు. లక్ష మందితో ఈ సభ ఉండబోతోందని అన్నారు. త్వరలోనే తేదీ ప్రకటిస్తా అని చెప్పారు.






