- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jagga Reddy: బీజేపీ నేతలకు త్యాగంచేసే గుణం ఉండి ఉంటే అద్వానీ ప్రధాని అయ్యేవాడు
రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇటీవల కాలంలో బీజేపీ అధికారంలోకి ఎలా వచ్చిందో బయటపెడుతున్నారని, బీజేపీ మూడుసార్లు అధికారంలోకి రావడానికి ఓట్ల దొంగతనం కారణమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్జగ్గారెడ్డి(Jagga Reddy) ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇటీవల కాలంలో బీజేపీ అధికారంలోకి ఎలా వచ్చిందో బయటపెడుతున్నారని, బీజేపీ మూడుసార్లు అధికారంలోకి రావడానికి ఓట్ల దొంగతనం కారణమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్జగ్గారెడ్డి(Jagga Reddy) ఆరోపించారు. ఇద్దరు కూడా ఉండలేని ఇంట్లో వంద మంది ఓటర్లు ఉన్నారని, ఎన్నికల కమిషన్(Election Commission) నిద్ర పోతుందా అని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్లోని గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ ఓట్ల చోరీ గురించి రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతుంటే, సమాధానం చెప్పుకోలేని బీజేపీ నేతలు సోనియా గాంధీ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చనిపోయిన ఓటర్లు కూడా రాహుల్ గాంధీ దగ్గరికి వచ్చారు, బీజేపీ ప్రభుత్వానికి కాలి కింద భూమి కదులుతోందన్నారు. ఎన్నికల కమిషన్ బీజేపీకి తొత్తులుగా మారారని జగ్గారెడ్డి విమర్శించారు. ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చినా పదవి త్యాగం చేసిన నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అని, వారి లాగా బీజేపీ నేతలు త్యాగాలు చేయగలరా అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్జగ్గారెడ్డి ప్రశ్నించారు. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతేనే కోట్లాడుతానని, అట్లాంటిది పదవిని వదులుకున్న చరిత్ర తమ నేతలది అన్నారు. అటల్ బిహారీ వాజ్ పాయ్, అద్వానీల కాలంలో విలువలతో ఉన్న బీజేపీ కాదన్నారు.
బీజేపీ నేతలకు తప్పు చేశాం అని భయం మొదలైందన్నారు. సోనియా, రాహుల్ గాంధీలకు ఉన్న గొప్ప గుణం బీజేపీ నేతలలో ఎవరికైనా ఉందా అని ప్రశ్నించారు. త్యాగాల మీద చర్చించే సత్తా మీకు ఉందా అని, త్యాగం చేసే గుణం మీకు ఉంటే అద్వానీ ప్రధాని అయ్యేవారని జగ్గారెడ్డి అన్నారు. లేనివి ఉన్నట్టు మాట్లాడటం, గాంధీ కుటుంబంపై బురదజల్లడం పనిగా బీజేపీ నేతలు పెట్టుకున్నారన్నారు. దేశ ప్రజల భద్రతతో కూడిన పాలన రాహుల్ గాంధీ కుటుంబానిది అని, త్యాగాల చరిత్రే లేని బీజేపీ త్యాగాల కుటుంబం మీద నిందలు వేస్తోందన్నారు. స్వాతంత్య్ర ఉద్యమాలలో బీజేపీ నేతల పాత్రనే లేదని, మోదీ, అమిత్ షా వాళ్ళ తల్లిదండ్రులను అడిగితే గాంధీ కుటుంబం గొప్పతనం చెప్తారన్నారు.
రాహుల్ గాంధీ కుటుంబం కాశ్మీర్ బ్రాహ్మణ కుటుంబమని, సోనియా గాంధీని దేశ ప్రజలు కూడా ఒప్పుకున్నారని జగ్గారెడ్డి చెప్పారు. ఈ దేశ సంప్రదాయాలకు సోనియా గాంధీ కట్టుబడి ఉందని, రాజీవ్ గాంధీ చనిపోయాక ఏడేళ్లు అజ్ఞాత జీవితం గడిపారన్నారు. ప్రజలు కోరుకుంటే సోనియా గాంధీ రాజకీయాల్లోకి వచ్చారు, దేశంలో పార్టీలు, రాజకీయాలు అధ్యయనం చేశారని జగ్గారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తల ఆలోచన మేరకు సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పని చేశారని, మిత్రపక్షాలు కోరినా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయలేదని తెలిపారు. రాహుల్ గాంధీ కూడా పదవి వద్దన్నారని జగ్గారెడ్డి తెలిపారు. సోనియా గాంధీ కాలి గోటికి కూడా బీజేపీ నేతలు సరిపోరని, ఆమె గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదన్నారు. ఆమె ఇందిరా గాంధీకి కోడలై 59 ఏళ్ళు అయ్యిందని, నిన్న మొన్న పుట్టిన వాళ్లు కూడా మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.






