బందీగా ఉండాలని ఎవరూ కోరుకోరు.. జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కీలక నేత, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jagga Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

బందీగా ఉండాలని ఎవరూ కోరుకోరు.. జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కీలక నేత, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jagga Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌(BRS)ని నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. ప్రజలకు స్వేచ్ఛగా ఉండాలనే కాంగ్రెస్‌ ఉండాలని అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఎస్‌ని అధికారంలోకి తెచ్చుకుని బందీగా ఉండాలని ఎవరూ కోరుకోరు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్పారు. విద్యార్థులు, మహిళలు, రైతులు, యువత ఇలా అనేక మంది చాలా కష్టాలు ఎదుర్కొన్నారని అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద నిరసన తెలిపే హక్కు కూడా ఉండేది కాదని అన్నారు. ధర్నా చౌక్‌ను ఎత్తేసి ఒక నియంతలాగా కేసీఆర్ పాలించాడని అన్నారు.

బీఆర్ఎస్‌కు పూర్తి భిన్నంగా కాంగ్రెస్ పాలన సాగుతోందని అన్నారు. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే అనేక హామీలు అమలు చేశామని అన్నారు. 60 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం.. రైతులకు రైతుభరోసా, రుణమాఫీ చేశాం, మహిళలకు ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణం, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇలా చెప్పుకుంటే అనేక హామీలు 17 నెలల్లోనే అమలు చేశామని చెప్పారు. ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దెదింపి మళ్లీ నియంత బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే ఎవరూ కోరుకోరు అని అన్నారు.

Next Story