వాళ్లింటి కిటికీల విలువ కూడా ఉండవు.. జగ్గారెడ్డి హాట్ కామెంట్స్

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-17 12:19:55  IST  )

నేషనల్‌ హెరాల్డ్‌ కేసు(National Herald Case)లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ(Sonia Gandhi), రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) పేర్లను ఛార్జ్‌షీట్‌లో చేర్చడాన్ని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jaggareddy) ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు.

వాళ్లింటి కిటికీల విలువ కూడా ఉండవు.. జగ్గారెడ్డి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్‌ హెరాల్డ్‌ కేసు(National Herald Case)లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ(Sonia Gandhi), రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) పేర్లను ఛార్జ్‌షీట్‌లో చేర్చడాన్ని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jaggareddy) ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. సోనియా, రాహుల్ గాంధీల మీద వస్తోన్న ఆరోపణలు చూస్తుంటే చాలా బాధగా ఉందని అన్నారు. కావాలనే కొందరు వాళ్ల మీద అసత్య ప్రచారం చేస్తూ, చేయిస్తున్నారని ఆవేదన చెందారు. సోనియా, రాహుల్ మీద బీజేపీ నేతలు చేసే ఆరోపణలు.. నెహ్రూ ఇంట్లో కిటికీల విలువ కూడా చేయవని కీలక వ్యాఖ్యలు చేశారు. వాజ్ పేయి హయాంలో రాని ఆరోపణలు ఇప్పుడెందుకు వస్తున్నాయని అనుమాన వ్యక్తం చేశారు.

ప్రధాని మోడీకి(Modi), రాహుల్‌కు చాలా వ్యత్యాసం ఉందని.. రాహుల్ పదవుల కోసం, పైసల కోసం ఏనాడూ పాకులాడలేదని అన్నారు. నేషనల్ హెరాల్డ్ అనేది స్వాతంత్ర్యం రాకముందు పెట్టిన పత్రిక. బిట్రీషు విధానాలకు వ్యతిరేకగా పనిచేసిందని గుర్తుచేశారు. నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక పెట్టినప్పుడు మోడీ, అమిత్ షా ఇద్దరు పుట్టకపోయి ఉండొచ్చని విమర్శించారు. కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. మరోవైపు ఏఐసీసీ పిలుపు మేరకు బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వద్ద కూడా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ నేతృత్వంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Next Story