కేటీఆర్‌ భార్యకు క్షమాపణ చెప్పను.. అసలు ఎందుకు చెప్పాలి: కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్

by Gantepaka Srikanth |

కేటీఆర్ భార్య(KTR Wife)పై కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్‌(Feroze Khan) చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్(Women's Commission) సీరియస్ అయిన విషయం తెలిసిందే.

కేటీఆర్‌ భార్యకు క్షమాపణ చెప్పను.. అసలు ఎందుకు చెప్పాలి: కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్
X

దిశ, వెబ్‌డెస్క్: కేటీఆర్ భార్య(KTR Wife)పై కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్‌(Feroze Khan) చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్(Women's Commission) సీరియస్ అయిన విషయం తెలిసిందే. జూన్ 21వ తేదీన గాంధీభవన్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడే సందర్భంగా ఫిరోజ్ ఖాన్ ‘కేటీఆర్ పెండ్లాం’ అని మాట్లాడారు. దీంతో ఆయన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ విచారణ చేపట్టింది. జూలై 4న ఉదయం 11:00 గంటలకు కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. అయితే.. నిన్న విచారణకు హాజరైన ఫిరోజ్ ఖాన్.. విచారణ అనంతరం మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

‘ఏం పీకుతారు అనేది చెడు మాట కాదు.. దీనికి హిందీలో ట్రాన్స్‌లేట్ చేస్తే క్యా ఉకాడతా అని అర్థం. నేను తెలుగు ఇప్పుడే నేర్చుకుంటున్నా.. ఫ్లో వచ్చినప్పుడు ఏం చెయ్యలేను. కవితకు, కేటీఆర్ భార్యకు క్షమాపణలు చెప్పను.. ఫ్లోలో వచ్చిన మాటలను వారు కూడా మనసు పెట్టుకోవద్దు’ అని మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరైన అనంతరం కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ మీడియాకు వివరించారు. వీడియో

Next Story