- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎంతో పాటు MLC కవితపైనా చర్యలు తీసుకోవాలి: భట్టి
by GSrikanth |
లిక్కర్ స్కామ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆ కేసులో నిందితులుగా ఉన్న అందరిపైనా చట్టపరంగా కఠినమైన చర్యలు

X
దిశ, వెబ్‌డెస్క్: లిక్కర్ స్కామ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆ కేసులో నిందితులుగా ఉన్న అందరిపైనా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 'అవినీతి రహిత పాలన అందిస్తానని ఢిల్లీ యువతను కేజ్రీవాల్ మోసం చేశాడని భట్టి మండిపడ్డారు. అవినీతి లేని సమాజ నిర్మాణం చేస్తానని చెప్పిన కేజ్రీవాల్ మాటలు నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే ఇంత మందిని మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ మార్పునకు ఆలోచన చేసే అనేకమంది ఆలోచనలకు కేజ్రీవాల్ వెన్నుపోటు పొడిచారని అన్నారు. అంతేగాక, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ఏపీకి చెందిన నేతలపైనా చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు.
Next Story






