మళ్లీ అలాంటి మాటలు మాట్లాడితే ఊరుకోము.. ఎర్రబెల్లి దయాకర్ రావుకు బండి సుధాకర్ గౌడ్ హెచ్చరిక

by Gantepaka Srikanth |
మళ్లీ అలాంటి మాటలు మాట్లాడితే ఊరుకోము.. ఎర్రబెల్లి దయాకర్ రావుకు బండి సుధాకర్ గౌడ్ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao)కు తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్(Bandi Sudhakar Goud) వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. ‘ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్య యుతంగా పూర్తి మెజారిటీ ఎమ్మెల్యేలతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోతుందని దయాకర్ రావు మాట్లాడడం ఆయన అధికార దాహానికి నిదర్శనం. ఆదరించి అందలం ఎక్కించిన తల్లి లాంటి టీడీపీ పార్టీని మోసం చేసి కేవలం కులబంధువులు అని బీఆర్ఎస్‌ ఎల్పీ(BRS LP)లో విలీనం చేశారు. మోసం, కుట్రలు, ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేయడంలో దయాకర్ రావు దిట్ట కాబట్టి ఆయన కదలికలపై మాకు అనుమానం ఉంది. ఈ విషయంలో సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర డీజీపీని కోరాం’ అని బండి సుధాకర్ గౌడ్ స్పష్టం చేశారు.

‘గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తూ ప్రజల అభిమానం చూరగోరుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. మరోసారి అలాంటి ప్రయత్నం చేస్తే ఊరుకోం. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఎమ్మెల్యేల జోలికి వస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో అన్ని పదవులు అనుభవించి డబ్బులు పదవులకు కక్కుర్తి పడి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మోసం చేసిన దయాకర్ రావుది నేర చరిత్ర. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయనకు లేదు’ అని బండి సుధాకర్ గౌడ్ తెలిపారు.

Next Story

Most Viewed