భట్టి విక్రమార్కకు సిగ్గులేదు! కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 14 |
భట్టి విక్రమార్కకు సిగ్గులేదు! కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: డిప్యూటీ సీఎం భట్టికి సిగ్గు లేదని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు తాజాగా గాంధీభవన్‌లో ఓ మీడియా చానల్‌‌తో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇటీవల యాదాద్రిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కింద కూర్చోబెట్టారని, కనీసం ప్రోటోకాల్ కూడా పాటించలేదని అన్నారు. కింద కూర్చోపెట్టిన సిగ్గులేకుండా నేనే కూర్చున్న అంటున్నాడని విమర్శలు చేశారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నాడని తీవ్ర విమర్శలు చేశారు.

భట్టి తమ పార్టీ నాయకుడు కాబట్టి ఉరుకున్నా.. లేదంటే అట్రాసిటీ కేసు పెట్టేవాడిని చెప్పారు. పేపర్ యాడ్‌లో భట్టి ఫోటో తీసేసి రేవంత్ రెడ్డి ఒక్కడి ఫోటోనే వేసుకుంటున్నారని, అంటే రేవంత్ మొహం చూసే ఓట్లు పడ్డాయని అనుకోవాలని సెటైర్లు వేశారు. జీవో 46 ఖమ్మం బాధితులు కూడా ఉన్నారుగా ఎందుకు రద్దు చెయ్యట్లేదని డిప్యూటీ సీఎంను నిలదీశారు.

అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారని, అలా దిగజారే కింద కూర్చున్నాడన్నారు. తానే భట్టి స్థానంలో ఉంటే వాళ్లని లేపి అయిన కూర్చుందును, లేకపోతే లేచి.. బయ్‌కాట్ చేసి వెళ్లిపోయే‌వాడినని అన్నారు. నామినేటెడ్ పదవులు ఒక్క దళితుడికి కూడా భట్టి ఇప్పించలేదు.. కానీ శాశిస్తున్నా అంటున్నాడు ఏమీ శాశిస్తున్నాడు.. అని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

Next Story

Most Viewed