కాంగ్రెస్ నేతపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి.. వెళ్తుంటే.. వెంటాడి మరీ..

by Gantepaka Srikanth |

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం(Balkonda Constituency)లో రాజకీయ రగడ కొనసాగుతోంది.

కాంగ్రెస్ నేతపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి.. వెళ్తుంటే.. వెంటాడి మరీ..
X

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం(Balkonda Constituency)లో రాజకీయ రగడ కొనసాగుతోంది. కాంగ్రెస్ NRI సెల్ నంగి దేవేందర్ రెడ్డి(Devender Reddy)పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఒక్క గల్ఫ్ బాధిత కుటుంబానికి న్యాయం చేయలేదని కాంగ్రెస్ విమర్శల నేపథ్యంలో నేడు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి(Vemula Prashanth Reddy) సొంత గ్రామమైన వేల్పూర్లో ప్రశాంత్ రెడ్డికి కనువిప్పు పేరిట కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టింది. దీనికి తాము సిద్ధమేనని పథకాలు అందని రైతులను తీసుకొస్తామని బీఆర్ఎస్ నేతలు సవాల్ చేశారు. దీంతో మాటామాటా పెరిగి కాంగ్రెస్ నేత నంగి దేవేందర్ రెడ్డి మరియు బొజ్జ అమరేందర్ రెడ్డిలపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అనుచరుల దాడికి దిగారు. ఆయనపై విచక్షణారహితంగా దాడి చేసి వెళ్లగొట్టారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు గ్రామానికి వచ్చి పరిస్థితిని అదుపుచేశారు. ప్రస్తుతం దేవేందర్ రెడ్డి పోలీసుల రక్షణలో తలదాచుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారిది.

Next Story