- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG News : సీఐడీ ముందు హాజరైన కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ నేత, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Adi Srinivas) నేడు సీఐడీ(CID) ముందు హాజరయ్యారు.

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ నేత, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Adi Srinivas) నేడు సీఐడీ(CID) ముందు హాజరయ్యారు. వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు కేసు(Chennamaneni Ramesh Babu)లో హాజరవ్వాలని సీఐడీ ఆది శ్రీనివాస్ కు నోటీసులు జారీ చేయగా.. నేడు ఆయన అధికారుల ముందు హాజరయ్యారు. భారత పౌరసత్వం లేకున్నా తప్పుడు పత్రాలతో చెన్నమనేని రమేష్ ఎన్నికల్లో పోటీ చేశారని ఆది శ్రీనివాస్ ఆరోపిస్తూ హైకోర్టు(High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఇటీవల తీర్పు వెలువరించిన న్యాయస్థానం.. రమేష్ ఎన్నిక చెల్లదని తీర్పునిస్తూ.. కోర్టు ఖర్చుల కింద శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు, న్యాయసేవా సంస్థకు రూ.5 లక్షలు చెల్లించాలని రమేష్ బాబును ఆదేశించింది.
అనంతరం తప్పుడు పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా, ఎమ్మెల్యేగా కొనసాగినందుకు చెన్నమనేని రమేష్ పై చర్యలు తీసుకోవలంటూ శ్రీనివాస్ గత నెల 17న సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా.. రమేష్ పై కేసు నమోదు చేశారు అధికారులు. అయితే దీనికి సంబంధించిన సాక్ష్యాలను సమర్పించాల్సిందిగా నోటీసులు జారీ చేయగా.. వాటికి సంబంధించిన వివరాలను సమర్పించారు శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని, రమేష్ బాబుకు తగిన శిక్ష పడేలా చూడాలని అధికారులను కోరినట్టు తెలిపారు.






