- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ నేతల మాటలు వింటుంటే నవ్వొస్తుంది: అద్దంకి
by GSrikanth |
బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అసహనంతో వాళ్లు మాట్లాడే మాటలు వింటుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. అక్కసుతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతల ప్రతీ ప్రశ్నకు తమ వద్ద ఆన్సర్ ఉందని చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు.
Next Story






