Addanki Dayakar: కేటీఆర్‌ను బయట తిరగనివ్వడమే ప్రభుత్వం చేస్తున్న తప్పు

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్ పార్టీని భార‌త రాబందుల స‌మితి అని పిలవాలని, హైద‌రాబాద్ చుట్టూ ఉన్న భూముల‌ను కేసీఆర్ ప‌దేళ్ల పాల‌న‌లో రాబందుల్లా దోచుకుందని శాసన మండలిలో ప్రభుత్వ విప్, అద్దంకి దయాకర్ మండిపడ్డారు.

Addanki Dayakar: కేటీఆర్‌ను బయట తిరగనివ్వడమే ప్రభుత్వం చేస్తున్న తప్పు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీని భార‌త రాబందుల స‌మితి అని పిలవాలని, హైద‌రాబాద్ చుట్టూ ఉన్న భూముల‌ను కేసీఆర్ ప‌దేళ్ల పాల‌న‌లో రాబందుల్లా దోచుకుందని శాసన మండలిలో ప్రభుత్వ విప్, అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిప‌క్షం అఘోరీలా వ్యవ‌హారిస్తోందని, బీఆర్ఎస్ లాంటి ప్రతిప‌క్షం ఉన్న రాష్ట్రం ముందుకు పోదన్నారు. పిచ్చి కుక్క క‌రిచిన‌ట్లు కేటీఆర్ మాట్లాడుతున్నాడని, ఆయన మాన‌సిక స్థితి చూసి ప్రభుత్వ ఖ‌ర్చుతో వైద్యం చేయించాలని అన్నారు. కేటీఆర్ మాట‌ల‌ను తెలంగాణ ప్రజ‌లు ప‌ట్టించుకోరని, సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో ప్రజ‌ల‌కు తెలుసు.. కేటీఆర్ చెపితే తెలుసుకునే ప‌రిస్థితి లేదని అద్దంకి దయాకర్ చెప్పారు. మాన‌వ విలువ‌లు, రాజ‌కీయ విలువ‌లు తెలుసుకుని కేటీఆర్ న‌డుచుకోవాలని, అబ‌ద్దాలు చెప్పి ప్రజ‌లను రెచ్చగొడుతున్నాడు, కేసీఆర్ ప్రతిప‌క్ష హోదా పోషించ‌కుండా ప‌నికి రాని కేటీఆర్‌ను ముందు పెడితే ఏం లాభమన్నారు.

కేటీఆర్ మీటింగ్‌లతో, బీఆర్ఎస్‌కు ఏమీ ఒర‌గ‌దని, హైద‌రాబాద్‌ను కేటీఆర్ స‌ర్వం దోచుకున్నాడని, బ‌య‌ట‌కు రానివ్వడ‌మే ప్రభుత్వం చేస్తున్న పెద్ద త‌ప్పు అని అద్దంకి దయాకర్ అన్నారు. ఎస్బీఐ ఆఫీస‌ర్లను కూడా లొంగ‌దీసుకున్నట్లు క‌నిపిస్తోందని, ప్రభుత్వం కేటాయించిన భూమిలో ఎస్బీఐ ప‌దేళ్ల పాటు ఎలాంటి నిర్మాణాలు చేయలేదని, రూ.300 కోట్లకు ఎక‌రం ప‌లుకితే రేవంత్ రెడ్డికి పేరు వ‌స్తుంద‌ని బీఆర్ఎస్ ప్రయ‌త్నమని ఆరోపించారు. ప్రభుత్వం భూములు వేలం వేసిన త‌ర్వాత ఎస్బీఐని కోర్టుకు పంపించి నీచులు పంచాయ‌తీ పెట్టారని, హెచ్ సీయూ భూముల్లో ప్రభుత్వానికి రూ.9 వేల కోట్లు వ‌స్తే రాష్ట్రానికి మంచి పేరు వ‌స్తుంద‌ని దుష్పచారం చేశారని, నీచాతి నీచ‌మైన‌ రాజ‌కీయాలు చేస్తున్నారని అద్దంకి దయాకర్ మండిపడ్డారు. మూసీ కోసం కేంద్రం ఒప్పుకుని 83 ఎక‌రాలు ఇవ్వడం బీఆర్ఎస్ కు వ‌శ‌ప‌డ‌టం లేదని, మూసీ పైన కేటీఆర్ త‌ప్పుడు ప్రచారాన్ని ప్రజ‌లు న‌మ్మరని, చేతకాని త‌నాన్ని ఒప్పుకోలేక కేటీఆర్ త‌ప్పుడు ప్రచారం చేస్తున్నాడని అద్దంకి దయాకర్ ఆరోపించారు.

Next Story