Dayakar: కేటీఆర్ మీదున్న సానుభూతి పోతోంది

by Gantepaka Srikanth |

కేటీఆర్(KTR) వ్యాఖ్యలతో ఆయన మీదున్న సానుభూతి పోతోందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్(Addanki Dayakar) అన్నారు.

Dayakar: కేటీఆర్ మీదున్న సానుభూతి పోతోంది
X

దిశ, వెబ్‌డెస్క్: కేటీఆర్(KTR) వ్యాఖ్యలతో ఆయన మీదున్న సానుభూతి పోతోందని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్(Addanki Dayakar) అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫార్ములా ఈరేస్ కేసులో ఈడీ(ED), ఏసీబీ(ACB) విచారణకు కేటీఆర్ సహకరించడం లేదని అన్నారు. విచారణ సంస్థల్ని ఆయన టెస్ట్ చేస్తున్నట్లు అనిపిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టానికి సహకరించడం కేటీఆర్ విధి అని గుర్తుచేశారు. కాగా, ఇవాళ కేటీఆర్‌ (KTR) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట హాజరయ్యారు. హెచ్‌ఎండీఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ఈడీ అధికారులు ఆరా తీశారు.


ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలనే తిప్పితిప్పి అడిగారని కేటీఆర్‌ తెలిపారు. లై-డిటెక్టర్‌ పరీక్షకు నేను సిద్ధం.. రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సిద్ధమా అని ప్రశ్నించారు. కోర్టులు, జడ్జిలపై నమ్మకం ఉందని, న్యాయమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. తప్పు చేయలేదు.. చేయబోను. తప్పు చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం అని కేటీఆర్‌ తెలిపారు. అన్నింటికీ సమాధానమిచ్చా. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తా.. ఎన్ని ప్రశ్నలు వేసినా సమాధానాలు చెబుతా. భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థను గౌరవిస్తా. విచారణకు పూర్తిగా సహకరిస్తా అని కేటీఆర్ స్పష్టం చేశారు.

Next Story