- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Addanki Dayakar: తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాలని BRS ప్రయత్నం
హరీష్‌రావు(Harish Rao), కేటీఆర్(KTR)కు కాంగ్రెస్(Congress) నేత అద్దంకి దయాకర్(Addanki Dayakar) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: హరీష్‌రావు(Harish Rao), కేటీఆర్(KTR)కు కాంగ్రెస్(Congress) నేత అద్దంకి దయాకర్(Addanki Dayakar) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం(Godavari Water Dispute) సృష్టించాలని బీఆర్‌ఎస్(BRS) నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు. మిగులు జలాలు, నదులపై చర్చలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. బీఆర్ఎస్(BRS) హయాంలో పోతిరెడ్డిపాడు(Pothireddypadu Reservoir)తో పాటు రాయలసీమ ప్రాజెక్టు(Rayalaseema Project)లు చేపడితే సైలెంట్‌గా ఉన్నారని గుర్తుచేశారు. సీఎం రేవంత్ చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారని అన్నారు.
ఇకనైనా బీఆర్‌ఎస్ నేతలు అసత్యాలు మానుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు కేటీఆర్, హరీష్ రావులు మాట్లాడుతూ.. గోదావరి జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ఏపీ ప్రభుత్వాన్ని ఆపడం చేతకాకుంటే అఖిలపక్షాన్ని తీసుకుపోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే చంద్రబాబు(Chandrababu)కు రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లిస్తున్నారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర హక్కులపై పోరాటం చేయాలని.. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే తాము చూస్తూ ఊరుకోమని కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్ స్పందించి కౌంటర్ ఇచ్చారు.






