- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ద్రోహం చేయడం మాత్రమే తెలుసు.. తెలంగాణ పర్యటనకు ముందు కాంగ్రెస్‍పై మోడీ నిప్పులు
కాంగ్రెస్ పార్టీని 'పరాన్నజీవి రాజకీయ శక్తి'గా అభివర్ణించిన ప్రధాని మోదీ. ద్రోహం చేయడం, అబద్ధాలు చెప్పడమే ఆ పార్టీ నైజమని మండిపడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పై మరోసారి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయడమే తెలుసు అని మండిపడ్డారు. ఇవాళ తెలగాణ పర్యటనకు ముందు కర్ణాటకలో పర్యటిస్తున్న ప్రధాని ఈ సందర్భంగా బెంగళూరులో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలనూ, ప్రజలనూ ద్రోహం'చేస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాంతీయ పార్టీల ఖర్చుతో మనుగడ సాగిస్తున్న 'పరాన్నజీవి రాజకీయ శక్తి'గా కాంగ్రెస్ ను అభివర్ణించారు. నకిలీ హామీలు, పేలవమైన పాలన, అంతర్గత అధికార పోరాటాల కారణంగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ఏ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండోసారి అధికారంలోకి రాలేదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్ది నెలల్లోనే కాంగ్రెస్‌పై వ్యతిరేకత మొదలవుతుందని ఎందుకంటే కాంగ్రెస్‌కు ద్రోహం చేయడం మాత్రమే తెలుసు. వారే అబద్ధాలకోరులు, వారి హామీలు కూడా బూటకమైనవి. కాంగ్రెస్ అధికార గ్రంథంలో పరిపాలన అనే అధ్యాయమే లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధఇకారంలో ఉన్న కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ రాష్టరాల్లో పరిపాలనా వైఫల్యాలు, అంతర్గత కలహాలతో సతమతంఅవుతోందని మోడీ విమర్శించారు.
డీఎంకేను మోసం చేశారు:
తమిళనాడులో తమ చిరకాల మిత్రపక్షమైన డీఎంకేను కాంగ్రెస్ ద్రోహం చేసిందని ప్రధానమంత్రి ఆరోపించారు. రాజకీయ సమీకరణాలు మారినప్పుడల్లా ఆ పార్టీ తన సొంత సంకీర్ణ భాగస్వాములకే పదేపదే వ్యతిరేకంగా మారుతోందన్నారు. పరాన్నజీవి కాంగ్రెస్ తన ఉనికిని నిలుపుకోవడానికి ఇప్పుడు మరో పార్టీ అండ అవసరం అని పదేపదే ఎన్నికల ఓటములను అంగీకరించలేక కాంగ్రెస్ , దాని మిత్రపక్షాలు ప్రజాస్వామ్య సంస్థలు, న్యాయస్థానాలు, రాజ్యాంగ ప్రక్రియలపై నిందలు మోపుతున్నాయని మండిపడ్డారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ ప్రక్రియలు, న్యాయస్థానాల పట్ల కాంగ్రెస్ ప్రదర్శించినట్లు ద్వేషం ప్రదర్శించడం నా ప్రజా జీవితంలో ఏ ప్రధాన రాజకీయ పార్టీని నేను ఎప్పుడూ చూడలేదన్నారు. ఒకనాడు 400కు పైగా లోక్‌సభ స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ ఇప్పుడు ఇతరులతో పొత్తులు పెట్టుకున్నా 100 సీట్ల మార్కును కూడా దాటలేకపోతోందని సెటైర్ వేశారు.
వారివి కుంభకోణ రాజకీయాలు:
పదేళ్ల క్రితం బెంగాల్‌లో మాకు కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండేవారని ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండేవారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం బీజేపీ బెంగాల్‍లో బీజేపీ 200 పైగా ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. కేరళలో కూడా బీజేపీ క్రమంగా తన ఉనికిని బలోపేతం చేసుకుంటోందని ఆయన తెలిపారు. రాష్ట్రాల వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు కర్ణాటకలోని అధికార పార్టీ పాలన కంటే అంతర్గత కలహాలతోనే సతమతమవుతోందని, ఈ ముఖ్యమంత్రి ఎన్ని రోజులు ఉంటారో ఇంకా నిర్ణయించలేదు. వేరొకరికి అవకాశం వస్తుందో లేదో కూడా తేలలేదని సెటైర్ వేశారు. కేరళలో ఫలితాలు వచ్చినా ఇంకా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని అక్కడ రెండున్నరేళ్ల ఫార్ములాను ఉపయోగించాలా లేక ఒక్కొక్కరికి ఒక ఏడాది చొప్పున ఐదుగురు ముఖ్యమంత్రుల ఫార్ములాను ఉపయోగించాలా అనే దానిపై వారు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని ఎద్దేవా చేశారు. ఇటీవలి ఎన్నికల విజయాలను ప్రస్తావిస్తూ భారతదేశ ప్రజలు స్థిరమైన, అభివృద్ధి 'కుంభకోణ రాజకీయాలు' అని తాను అభివర్ణించిన వాటి కంటే 'స్థిరత్వం మరియు అభివృద్ధి'ని ఎంచుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ కనబరిచిన పనితీరు, ఎన్డీఏకు పెరుగుతున్న ప్రజా మద్దతుకు నిదర్శనమని ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు .






