రేవంత్ డీఎన్‌ఏలో కాంగ్రెస్ లేదు.. బీజేపీ ఎంపీ సెన్సేషనల్ కామెంట్స్

by Kema Shiva Kumar |

రేవంత్ రెడ్డి డీఎన్ఏ‌ (DNA)లో కాంగ్రెస్ (Congress) లేదని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) అన్నారు.

రేవంత్ డీఎన్‌ఏలో కాంగ్రెస్ లేదు.. బీజేపీ ఎంపీ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రేవంత్ రెడ్డి డీఎన్ఏ‌ (DNA)లో కాంగ్రెస్ (Congress) లేదని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ (MP Laxman) అన్నారు. ఇవాళ కేంద్రం చేపట్టబోతున్న కులగణన (Cast Census Census)పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ హైదరాబా‌ద్‌ (Hyderbad)లో మీడియాతో మాట్లాడుతూ.. కులగణనకు కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఎప్పటి నుంచో వ్యతిరేమని అన్నారు. ఆ పార్టీ గురించి రేవంత్ ఇంకా చాలా తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఓబీసీ (OBC)లపై రాహుల్, రేవంత్‌లు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. ఓట్ల కోసమై తెలంగాణ (Telangana)లో సర్వే చేపట్టారని ధ్వజమెత్తారు. చేసిన సర్వే వివరాలను పబ్లిక్ డొమైన్‌ (Public Domain)లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

తాము ఎవరి ఒత్తిడికి తలొగ్గలేదని.. కంటితుడుపు చర్యగా తాము సర్వేలు చేయబోమని అన్నారు. సామాజిక అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం (Central Government) కులగణను చేపట్టబోతోందని అన్నారు. ఇక జనగణనత పాటు కులగణన చేపడుతున్నందుకు ఆయన ప్రధాని మోడీకి ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు. ఈ పరిణామంతో బడుగు, బలహీనవర్గాల అభివృద్ధిలో దూసుకెళ్తారని ఆకాంక్షించారు. శాస్త్రీయంగా కులగణన చేయాలని మోడీ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ప్రైవేటు ఏజెన్సీలతో సర్వే చేయించిందని.. ఆ వివరాలను కూడా బహిర్గతం చేయలేదని ఆరోపించారు. ఆ సర్వే పేరుతో కాంగ్రెస్ అక్షరాల రూ.5 వేల కోట్లను దుర్వినియోగం చేసిందని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు.

Next Story