కాంగ్రెస్‌కు మిగిలేది శూన్యహస్తమే.. మాజీ మంత్రి ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) అన్నారు. ఇ

కాంగ్రెస్‌కు మిగిలేది శూన్యహస్తమే.. మాజీ మంత్రి ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) అన్నారు. ఇవాళ ఆయన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల వచ్చిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ (Congress)‌కు చెంపపెట్టు అని ఎద్దేవా చేశారు. వెయ్యిలోపు ఓట్లు ఉన్న గ్రామాల్లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారని అన్నారు. మేజర్ పంచాయతీలన్నీ బీఆర్ఎస్ (BRS) పార్టీనే కైవసం చేసుకుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో హస్తం పార్టీకి శూన్య హస్తమే మిగులుతుందని జోస్యం చెప్పారు.

Next Story