Harish Rao: అందుకే మంత్రులు నన్ను టార్గెట్ చేస్తున్నారు.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |

తనను ఉద్దేశించి అన్ ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు స్పందించారు.

Harish Rao: అందుకే మంత్రులు నన్ను టార్గెట్ చేస్తున్నారు.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: థర్మల్ పవర్ ప్రాజెక్టులో (Thermal Power Scam) రూ. 50 వేల కోట్ల స్కామ్ జరిగిందని ఈ స్కామ్‍ను బయటపెట్టినందుకే మంత్రులు నన్ను టార్గెట్ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా థర్మల్ విద్యుత్‍ను తగ్గిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త థర్మల్ ప్రాజెక్టులకు ఎందుకు ముందుకు వస్తోందని నిలదీశారు. ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తనను ఉద్దేశించి అన్ ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని మాట్లాడారు. కానీ ఈ స్కామ్‍పై మాత్రం మాట్లాడలేదని విమర్శించారు.

తాము అధికారంలోకి వస్తే యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు తాళం వేస్తామని చెప్పిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కేబినెట్‍లో తాళాలు కొడుతున్నారని సెటైర్ వేశారు. కాంగ్రెస్ అడ్డగోలు వ్యవహారాలు ప్రజలకు అర్థం అవుతోందన్నారు. ప్రతిపక్షంలో ఓ మాట అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతూ కాంగ్రెస్ నిస్సిగ్గుగా మాట్లాడుతోందన్నారు. గ్రీన్ పాలసీ గాలికి పోయిందని 30 పర్సెంట్ కమిషన్ కోసం కొత్త పాలసీ తెరమీదకు వచ్చారన్నారు. మీ కమిషన్ల కోసం రాష్ట్ర ప్రజల మీద రూ. 82 వేల కోట్ల భారం ఎందుకు వేస్తున్నారని భట్టి విక్రమార్కను సూటిగా ప్రశ్నించారు. విద్యుత్ శాఖలో పూర్తిగా ఆంధ్ర అధికారులతో నింపుతున్నారని హరీశ్ రావు ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతోనన్నారు. కేసీఆర్ 90 శాతం స్థానికులకోసం రిజర్వేషన్లు తెచ్చారని గుర్తు చేశారు.

Next Story