- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ కృత్రిమ ఎరువుల కొరత సృష్టిస్తోంది : రామచందర్ రావు
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు(N. Ramachandra Rao) మరోసారి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు(N. Ramachandra Rao) మరోసారి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తూ కొత్త నాటకం ఆడుతోందని ఆరోపించారు. గత 19 నెలలుగా రైతులకు ఎటువంటి ఆర్థిక సహాయం అందించకుండా, ఇప్పుడు కేవలం రూ. 6000 మాత్రమే ఇస్తామని ప్రకటించడం ద్వారా రైతులను మభ్యపెడుతోందని ఆయన ఆరోపించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ. 15,000 ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ, గత సీజన్‌లో ఎటువంటి సహాయం అందించకుండా గాలికి వదిలేశారని అన్నారు. ఇప్పుడు స్థానిక ఎన్నికల వస్తున్న నేపథ్యంలో రైతుభరోసా అంటూ కొత్త నాటకానికి తెరలేపారని మండిపడ్డారు. అలాగే, తెలంగాణలో యూరియా కొరత ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను ఆయన తప్పుబట్టారు. కాంగ్రెస్ హయాంలో రైతులు యూరియా కోసం రోజుల తరబడి క్యూలలో వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తోందని ఆరోపించారు. అయితే నిజానికి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అవసరమైన దానికంటే ఎక్కువ యూరియా సరఫరా చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
గత రబీ సీజన్‌కు తెలంగాణకు 9.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, కేంద్రం 12.02 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేసిందని తెలిపారు. అలాగే DAP 1.47 లక్షల టన్నులు అవసరం ఉండగా.. 1.72 లక్షల టన్నులు అందించిందని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం నుంచి అదనపు సరఫరా ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని మార్క్‌ఫెడ్ లో ఆర్థిక సమస్యలు, పంపిణీ వ్యవస్థలోని లోపాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ వైఫల్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని రామచందర్ రావు ఆరోపించారు.






