- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ ఉంది.. ఎమ్మెల్యే పల్లా హాట్ కామెంట్స్
తెలంగాణ జాగృతి వ్యవస్థపకురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)ను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ గుబాబీ బాస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జాగృతి వ్యవస్థపకురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)ను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ గుబాబీ బాస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాలంలో కవిత ప్రవర్తన, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు భారత రాష్ట్ర సమితికి నష్టం కలిగించేలా ఉన్నాయని.. అధిష్ఠానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా పార్టీ క్రమశిక్షణ కమిటీ ఓ ప్రకటను విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే కవిత సస్పెన్షన్‌పై జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్టీ కార్యకర్తల నిర్ణయం మేరకే కవితపై సస్పెన్షన్ వేటు పడిందని అన్నారు. పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకే పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో బీఆర్ఎస్‌కు ఎవరు నష్టం చేకూర్చినా ఇలాంటి చర్యలే ఉంటాయని అన్నారు. కేసీఆర్‌కు కొడుకు, అల్లుడు, బిడ్డా అంతా సమానమేనని తెలిపారు. కవిత పార్టీ నుంచి పోయినంత మాత్రానా పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడిన పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. రాష్ట్రంలో తప్పకుండా మళ్లీ అధికారంలోకి వస్తామని, కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబాన్ని చిల్చేందుకు కుట్రలు చేశారని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.
Read More..
KCR ఫ్యామిలీ కొత్త డ్రామా.. మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు
కుటుంబ తగాదాల్లోకి మమ్మల్ని లాగడం సరికాదు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్






