కుటుంబ తగాదాల్లోకి మమ్మల్ని లాగడం సరికాదు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-02 10:16:06  IST  )

కుటుంబ తగాదాల్లోకి మమ్మల్ని లాగడం సరికాదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు...

కుటుంబ తగాదాల్లోకి మమ్మల్ని లాగడం సరికాదు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
X

దిశ, వెబ్ డెస్క్: కాళేశ్వరం(Kaleswaram) అవినీతిపై ఎమ్మెల్సీ కవిత(Mlc Kavitha) చేసిన వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్(Minister Adluri Laxman) స్పందించారు. అవి కుటుంబ తగాదాలని, ఎమ్మెల్సీ కవిత(Mlc Kavitha)నే చూసుకోవాలని, తమను లాగడం సరికాదని ఆయన చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఎమ్మెల్సీ కవిత పరోక్షంగా అంగీకరించారని తెలిపారు. తాము కక్ష్య సాధింపు చర్యలు చేయడం లేదన్నారు. హరీష్‌రావు(Harish Rao), సంతోష్‌రావు(Santhosh Rao) వెనుక ఉండాల్సిన అవసరం తమకు లేదన్నారు.

తెలంగాణ(Telangana)లో 10 ఏళ్లపాటు గత ప్రభుత్వం గిరిజన తండాలను పట్టించుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం గిరిజన తండాలకు రోడ్ల విషయంలో ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టిందని తెలిపారు. ఇటీవల వచ్చిన వరదలకు కొన్ని జిల్లాలో రోడ్లు దెబ్బతిన్నాయని, GO 240 ప్రకారం నిధుల మంజూరు అయ్యాయని తెలిపారు. 429 గిరిజన ఆవాసాలకు 700 కోట్లతో రోడ్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఐటీడీఏ పరిధిలోని 236 ఆమ్లెట్ గ్రామాలకు రోడ్లకు నిధులు మంజూరు చేశామని తెలిపారు. ST సబ్ ప్లాన్ ద్వారా నిధుల మంజూరయ్యాయని, త్వరలోనే టెండర్లు పిలుస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు.

Read More..

కవితపై వేటు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హర్షం

Next Story