రాష్ట్రంలో కాంగ్రెస్‌ది సుతిలేని సంసారం.. ఎంపీ రఘునందర్ రావు హాట్ సెటైర్లు

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో మెట్రో ఫేజ్-1 టేకోవర్‌లో భారీగా అవకతవకలు జరగాయని ఎంపీ రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ది సుతిలేని సంసారం.. ఎంపీ రఘునందర్ రావు హాట్ సెటైర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేంద్ర ప్రభత్వాన్ని బద్నాం చేసేందుకు కంకణం కట్టుకున్నాడని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) ఆరోపించారు. ఇవాళ ఆయన నగరంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మెట్రో ఫేజ్-1 టేకోవర్‌లో భారీగా అవకతవకలు జరగాయని.. వాటిపై విచారణ జరిపి ఎక్కడ తనపై కేసులు పేడతారేమోనని సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్‌‌కు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి IRFC రుణం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పూచీకత్తుతోనే వచ్చిందని అన్నారు. అలాంటప్పుడు మెట్రో ఫేజ్-2 పనులకు కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆయన సూటిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన.. సుతి లేసి సంసారంలా ఉందని ఫైర్ అయ్యారు. మంత్రులు, ముఖ్యమంత్రి మాటలను అసలు వినడం లేదని అందుకే రేవంత్ రెడ్డి తీవ్ర ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని రఘునందర్ రావు అన్నారు.

Next Story